Tulsi Leaves: తులసి మొక్కను దేవతా రూపంగా భావిస్తారు. ఆయుర్వేదంలో దీనిని మహాఔషధి అని అంటారు. తులసి దాని పోషక విలువలు, ప్రత్యేక ఔషధ గుణాల కారణంగా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
తులసి శాస్త్రీయ నామం ఓసిమమ్ బాసిలికం. తులసి మొక్కను పెంచడం కూడా సులభం. దీన్ని చిన్న కుండలో కూడా పెంచుకోవచ్చు. మన పూర్వీకులు తులసి ఆకులను టీ, కషాయాలలో ఉపయోగించే వారు. ఇది సాధారణ జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా గొంతు నొప్పిని తగ్గిస్తుంది . కఫాన్ని కూడా తొలగిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి నిర్వహణలో కూడా సహాయపడుతుంది.
తులసి మొక్కలో ఉండే పోషకాలు ఏవి ?
తులసి ఆకులు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉంటాయి. ఇది పుదీనా కుటుంబానికి చెందిన ఆకుపచ్చ మొక్క. ఇది ఆసియా , ఆఫ్రికా ఉపఖండాలలో ఉద్భవించింది. తులసి ఆకుల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. అంతే కాకుండా తులసి ఆకులు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి ఆకులను తినడం వల్ల ఎలాంటి లాభాలుంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్‌ను నివారిస్తుంది:
ఆగస్టు 2016లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, తులసి అనేక రకాల క్యాన్సర్‌ల నుండి మనల్ని రక్షిస్తుంది తులసి ఆకులు మానవ పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని రుజువు చేయబడింది.
జనవరి 2015లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, తులసి ఆకుల సారం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. తులసి క్యాన్సర్ కణాలు పెరగకుండా, విభజించకుండా నిరోధిస్తుంది.
రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణ:
తులసి ఆకులను శతాబ్దాలుగా చైనీయులు గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. మే 2010లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, తులసి ఆకులు అధిక రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే, అవి శరీరం ఇన్ఫెక్షన్లు ,వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. దీని ఆకులు సాధారణ జలుబు, దగ్గును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
తులసి ఆకులు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావం పెరుగుతుంది. వీటి సహాయంతో జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇది అసిడిటీ, గ్యాస్ సమస్యను కూడా తొలగిస్తుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలు ఎదుర్కొనే వారికి తులసి దివ్యౌషధం.
Also Read: ఈ హెయిర్ మాస్క్ ఒక్కసారి వాడినా చాలు.. జుట్టు పెరగడం గ్యారంటీ
ఆమ్ల వ్యతిరేకత:
తులసి ఆకులు సహజ ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా వాపును తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఆమ్లత్వం అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా తులసి ఆకులను రోజూ తీసుకుంటే, ఈ వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులలో ప్రయోజనకరం:
తులసి ఆకుల్లోని లక్షణాలు ఉబ్బసం , దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇది తరచుగా వచ్చే ఎక్కిళ్ల సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.