BigTV English

Jealous Symptoms: మీపై అసూయ పడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. వారితో జర భద్రం!

Jealous Symptoms: మీపై అసూయ పడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. వారితో జర భద్రం!

అసూయ అనేది మనిషికి ఉండే లక్షణాలలో ఒకటి. ఆఫీసులో మీ సహోద్యోగులను ఎవరైనా పొగిడినా లేదా వారు ఎక్కువ జీతాన్ని పొందుతున్న అసూయ పడుతూ ఉంటారు. ఇంట్లో కూడా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య ఇలాంటి అసూయ ఉంటుంది. అసూయ ఎన్నో రకాలు. మీతో చదువుకునే విద్యార్థులు, స్నేహితులు, మీతో పని చేసే ఉద్యోగులు అందరూ ఏదో ఒక విషయంలో అసూయ పడుతూనే ఉంటారు. మీ పట్ల వారు అసూయ కలిగి ఉంటే వారిలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి.


మీరు ఉన్నప్పుడు మీతో చక్కగానే నవ్వుతూ మాట్లాడుతూ మీరు లేనప్పుడు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారంటే అది వారిలో మీ పట్ల అసూయ ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే మీపై గాసిపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నా కూడా వారితో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీ విజయాలు లేదా మీలో ఉన్న కొన్ని లక్షణాలు పట్ల వారు అసూయ పడుతున్నారని అర్థం.

మీతో ఎలాంటి గొడవ లేకపోయినా పదే పదే మిమ్మల్ని బాధ పెట్టినట్టు మాట్లాడడం, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కూడా అసూయలో భాగమే. వారు మీకు హాని చేయని పనులే చేస్తారు. కానీ అవి మీకు బాధను కలిగిస్తాయి. అయితే వారు చేసే పనులన్నీ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు గుర్తించాలి. అసూయ అనేది వారిలో రగులుకొని.. మీపై చెడుగా ప్రవర్తించేలా చేస్తుంది.


మీరు వారితో చక్కగా ప్రవర్తిస్తున్నా, ఉద్యోగంలో రాణిస్తున్నా ఎన్నో విజయాలను అందుకుంటున్నా కూడా వారు మీ విజయాలను, మీ మంచి ప్రవర్తనను గుర్తించరు. ఇతరుల మిమ్మల్ని అభినందిస్తున్నప్పుడు కూడా వారు మౌనంగా ఉంటారు. లేదా మీ విజయాన్ని తగ్గించేలా మాట్లాడతారు. మీపై అసూయ ఉంటే ఇలాంటి పనులే చేస్తారు.

ఎవరైనా మీ తప్పులను ఎంచి మాట్లాడినా, మిమ్మల్ని విమర్శించినా వారు చాలా ఆనందపడతారు, నవ్వుతారు కూడా. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారికి ఆనందంతో కూడిన నవ్వు వస్తుంది. ఆ నవ్వును వారు దాచుకోలేరు. దాన్ని వారు ఎక్కువగా ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తారు. అలా మీకు ఎవరైనా కనిపిస్తే వారు మీ పట్ల ఏదో ఒక విషయంలో అసూయను కలిగి ఉన్నారని అర్థం చేసుకోండి.

మీ పట్ల అసూయ ఉన్నవారు ఎల్లప్పుడూ మీతో తమను పోల్చుకుంటూ ఉంటారు. మీ విజయాలను, మీ రూపాన్ని, మీ జీవన శైలిని తమతో పోల్చుకొని మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మిమ్మల్ని తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం పై వారి అభిప్రాయాన్ని చెప్పడానికి బదులుగా మీ లోపాలను మాత్రమే ఎత్తిచూపుతారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి సాకులు వెతుకుతారు. మీరు సంతోషంగా ఉంటే చూడలేరు. వెంటనే ఏదో ఒక మాట అని బాధ పెడతారు. మీ ఉనికే వారికి ఒక్కొక్కసారి అసూయగా మారుతుంది. ముఖ్యంగా సహోద్యోగుల్లోనే ఇలాంటి అసూయ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే కలిసి చదువుకునే విద్యార్థుల్లో కూడా ఇలాంటి అసూయ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read: మీ జీవిత భాగస్వామి.. మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి, అదిరిపోయే టిప్!

వారు మీకు మంచి సలహాలు ఇవ్వడానికి ఇష్టపడరు. తప్పుడు సలహాలు ఇచ్చి మీరు బాధపడేలా చేయాలని అనుకుంటారు. ఉదేశ పూర్వకంగా మిమ్మల్ని చెడు చేయాలని భావిస్తారు. ఇలాంటివారిని కనిపెట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×