Jowar Roti : ప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అనేది ఓ సవాలుగా మారింది. మారుతున్న జీవనశైలితో పాటు ఆహారంలోను చాలా మార్పులు జరుగుతున్నాయి. ఉద్యోగం వెంట తీరిక లేకుండా పరుగులు పెడుతున్న జనాలకు తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది. దీంతో ఈ తరుణంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి ఘటన కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా తరచూ సమతుల ఆహారం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో భాగంగా చపాతీలను తీసుకోవడం అలవాటుగా పెట్టుకుంటున్నారు.
అయితే చపాతీలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుందో చాలా మందికి తెలియదు. చపాతీలను గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండిలతో వివిధ రకాల చపాతీలను తయారుచేసుకుంటారు. అయితే వీటిలో ముఖ్యంగా జొన్న రొట్టెలను తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ జొన్న రోటీలను తయారుచేసుకునే విధానం మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు.
జొన్న రోటీలు తయారుచేసుకునే విధానం..
జొన్న పిండి, తగినంత వేడి నీళ్లు, ఉప్పు తీసుకోవాలి. ముందుగా ఓ పాత్రలో ఒక కప్పు నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం దానికి సరిపడా పిండిని నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు మూతపెట్టి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పిండి వేడెక్కి మెత్తగా నానుతుంది. దీనిని చేతులతో బాగా కలిపి రోటీలు చేసుకుంటే మృదువుగా వస్తాయి.
అనంతరం గుండ్రటి లడ్డూలుగా తయారుచేసుకుని చపాతీలుగా చేతితో తయారుచేసుకోవాలి. దీనిని వేడి పెనంపై వేసి కాల్చుకోవాలి. ఇలా 30 సెకన్ల పాటు కాల్చుకుంటే జొన్న రోటీలు తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న రోటీలను తినడం వల్ల అధిక బరువు, రక్తహీనత, మధుమేహం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.