BigTV English

Leftover Roti: చపాతీలు మిగిలిపోతే వాటిని బయటపడేసే కన్నా.. వీటిని వండేయండి

Leftover Roti: చపాతీలు మిగిలిపోతే వాటిని బయటపడేసే కన్నా.. వీటిని వండేయండి

Leftover roti: అన్నమే కాదు, అప్పుడప్పుడు ఇంట్లో చపాతీలు కూడా మిగిలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అన్నం మానేసి చపాతీలు తింటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి చపాతీలు మిగిలిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలా మిగిలిపోయినప్పుడు ఎంతోమంది బయట వారికి ఇచ్చేయడం, పడేయడం, ఆవులకు పెట్టడం వంటివి చేస్తారు. నిజానికి వాటితో చక్కగా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. సింపుల్ గా వాటితో ఏం చేయొచ్చో తెలుసుకోండి.


అన్నం మిగిలిపోతే దాన్ని పులిహోరగా, పుదీనా రైస్ గా, ఎగ్ రైస్ గా… ఎలా మారుస్తున్నామో మిగిలిపోయిన చపాతీలను కూడా అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు. ఆహారాన్ని వ్యర్థం చేయకుండా వాటిని తిరిగి ఇలా వండితే అదిరిపోవడం ఖాయం.

చపాతీ నూడుల్స్
చపాతీలు మిగిలిపోతే నూడుల్స్ చేయండి. చపాతీలను నూడుల్స్ ఆకారంలో కత్తిరించుకోవాలి. అవి సన్నని రిబ్బన్ లాగా ఉంటాయి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఉల్లిపాయలు తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి. రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. ఆ తర్వాత టమాటో కెచప్, వెనిగర్, సోయాసాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి. ముందుగా కత్తిరించి పెట్టుకున్న చపాతీ రిబ్బన్లను అందులో వేసి టాస్ చేసుకోవాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది.


రోటీ టాకోస్
మెట్రో సిటీలో ఉండే వారికి టాకోస్ గురించి తెలిసిందే. టాకోస్ అంటే ఒక రకమైన తినుబండారం. ఇది ఒక రకమైన శాండ్విచ్ అని చెప్పుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయల తరుగు, వెల్లుల్లి తరుగు, కాప్సికం తరుగు, స్వీట్ కార్న్ వేసి బాగా వేయించుకోవాలి. టమాటో సాస్ కూడా వేసి వేయించాలి. మీకు నచ్చిన ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్.చు ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి దాన్ని టాకో రూపంలో నొక్కాలి. అంతే అలా చపాతీతో కలిపి వాటిని తినేయడమే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రోటీ ఉప్మా
రోటీలు, చపాతీలు మిగిలిపోతే చక్కగా వాటితో ఉప్మా చేసుకోవచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలని వేసి చిటపటలాడించాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకులు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తరుగు, బఠానీలు వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మిరియాల పొడిని కూడా జోడించాలి. మిగిలిపోయిన చపాతీలను ఒకసారి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ కచ్చాపచ్చా రుబ్బుకున్న చపాతీ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ రోటీ ఉప్మా రెడీ అయినట్టే.

రోటి పిజ్జా
పిజ్జా అనగానే మైదాతో చేసిన బేస్ మాత్రమే గుర్తొస్తుంది. చపాతీని బేస్ గా చేసుకొని పైన పిజ్జా ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఉడికించిన చికెన్, పనీరు వంటిని వాడుకోవచ్చు. తురిమిన చీజ్ ను వేసుకోవచ్చు. చపాతీపై పిజ్జా సాస్ లేదా టమాటా సాస్ ను వేయండి. దానిపైన తరిగిన కూరగాయ ముక్కలను, ఉడికించిన చికెన్ ముక్కలు వేయండి. అలాగే తురిమిన చీజ్ తో ఆ చపాతీని నింపేయండి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో 15 నిమిషాలు ఉంచి బయటికి తీయండి. అంతే టేస్టీ రోటీ పిజ్జా రెడీ అయిపోతుంది.

రోటీ లడ్డు
మిగిలిపోయిన రోటి ముక్కలను లేదా చపాతీలను మిక్సీలో వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి. ఆ నెయ్యిలో ఈ చపాతీలా పొడి మిశ్రమాన్ని వేసి రంగు మారేవరకు వేయించుకోండి. ఇప్పుడు తురిమిన బెల్లాన్ని కూడా వేసి బాగా కలపండి. జిగటగా దగ్గరగా హల్వా లాగా అవుతుంది. ఆ సమయంలో కొన్ని రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ పొడి చేసి చల్లుకోండి. అలాగే యాలకుల పొడిని కూడా వేసి కలపండి. ఈ మిశ్రమ చల్లార్చాక లడ్డూల్లా చుట్టుకోండి. అంతే రోటీ లడ్డు రెడీ అయినట్టే.

టేస్టీ రోటి రబ్రీ
స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలు మరిగించండి. మరుగుతున్న పాలల్లో చపాతీ ముక్కలను వేయండి. అలాగే పాలపొడిని కూడా వేసి మొత్తం మిశ్రమం దగ్గరగా చిక్కబడే వరకు ఉంచండి. దాల్చిన చెక్క పొడిని, పంచదార లేదా బెల్లాన్ని కూడా ఇందులో వేసి బాగా కలపండి .ఎండు ద్రాక్షలు, బాదంపప్పు తరుగులు వేసి బాగా కలుపుకోండి. అంతే టేస్టీ రోటీ రబ్రీ రెడీ అయినట్టే. ఇది రుచికరంగా ఉంటుంది.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×