BigTV English
Advertisement

Iron Deficiency Symptoms: ఈ లక్షణాలు ఉంటే.. శరీరంలో ఐరన్ లోపించినట్లే..!

Iron Deficiency Symptoms: ఈ లక్షణాలు ఉంటే.. శరీరంలో ఐరన్ లోపించినట్లే..!
Iron Deficiency
Iron Deficiency Symptoms

Causes Of Iron Deficiency: మన శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజం ఐరన్. కండరాలు బలంగా ఉండటానికి, మెదడు పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థకు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి శరీరంలో సరిపడ ఐరన్ ఉండాలి. శరీరంలో ఐరన్ లోపిస్తే అనేక వ్యాధులు చుట్టుముడతాయి. శరీరం సమర్థవంతంగా పనిచేయాలంటే ఐరన్ చాలా ముఖ్యం. పిల్లల మెదడు ఎదుగుదలకు ఐరన్  సహకరిస్తుంది.


అయితే ప్రస్తుత జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా ఎక్కువ మందిలో ఐరన్ లోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ లక్షణాలు మీ శరీరంలో గనుకు గమనించినట్లయితే ఐరన్ లోపం ఉన్నట్లు భావించాలి. అవేంటో చూడండి.

ఐరన్ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్‌, ఆక్సిజన్‌ను అవయవాలకు సరఫరా చేస్తుంది. అంతేకాకుండా హిమోగ్లోబిన్ ఉత్పత్తిలోనూ ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపిస్తే శరీర అవయవాలకు పోషకాలు, ఆక్సిజన్ సరఫరా అవ్వక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో ఐరన్ లోపంతో బాధపడేవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అధికంగానే ఉంది. ఇందులో మహిళల, పిల్లలు అధికంగా ఉన్నారు.


Also Read: మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

శరీరంలో ఐరన్ లోపిస్తే పోషకాలు అందవు. మనం తీసుకునే ఆహారంలో అధికంగా ఐరన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఎటువంటి ఐరన్ ఉత్పత్తి కాదు. ఆహారం ద్వారానే ఐరన్ శరీరంలోకి వెళ్లాలి. ఐరన్ లోపం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

ఐరన్ లోపం లక్షణాలు

  • చిన్న చిన్న పనులకి అలసట రావడం.
  • విపరీతంగా నీరసంగా ఉండడం.
  • బలహీనంగా ఉన్నట్టు అనిపించడం.
  • శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం.
  • తరచూ మైకం కమ్మినట్టుగా ఉండటం.
  • గాలిలో తేలుతున్నట్టు అనిపించడం..
  • ఏ విషయం పైన ఏకాగ్రత ఉంచలేరు.
  • త్వరగా అంటువ్యాధులు సోకడం.
  • లైంగిక ఆసక్తి తగ్గిపోవడం.

శరీరంలో ఐరన్ పెంచే ఆహారాలు

బచ్చలికూర

బచ్చలికూరలో ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల పచ్చి బచ్చలికూరలో 2.7 మి.గ్రా ఐరన్ ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఐరన్ సోషణను పెంచుతుంది.

Also Read: నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? గుండె జబ్బులకు దీనికి సంబంధం ఏంటి?

శనగలు

ఒక కప్పు శనగల్లో దాదాపు 6.6 మి.గ్రా ఐరన్ ఉంటుంది. శాఖహారులకు ఐరన్ అందిచండో శనగలు సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో ఐరన్ సంమృద్ధిగా ఉంటుంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.5 మి.గ్రా ఐరన్ ఉంటుంది. అలానే వీటిలో విటమిన్ కె, జింక్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

బ్రోకలీ

ఒక కప్పు బ్రోకలీలో 1 మి.గ్రా ఐరన్ ఉంటుంది. అలానే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం ఐరన్ గ్రహించేలా చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో కూడా బ్రోకలీ ప్రభావంతంగా పనిచేస్తుంది.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా భావించండి.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×