Vaseline Benefits : వాసెలిన్ కేవలం ఒక సాధారణ పెట్రోలియం జెల్లీ మాత్రమే కాదు.. ఇది చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. పొడ వాటి కనురెప్పలతో పాటు డ్రై స్కిన్ సమస్యను దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది దీనిని అనేక విధాలుగా చర్మానికి ఉపయోగించవచ్చు. మీరు కూడా స్కిన్ కేర్‌లో భాగంగా వాసెలిన్ ఉపయోగించాలని అనుకుంటే గనక ఈ టిప్స్ మీ కోసమే..
1. పొడవైన కనురెప్పల కోసం:
మీకు సహజంగా పొడవైన, మందపాటి కనురెప్పలు కావాలంటే ప్రతిరోజూ వాసెలిన్ వాడటం అలవాటు చేసుకోండి. కాస్త వాసెలిన్ తీసుకుని రాత్రి పడుకునే ముందు మీ కనురెప్పలపై అప్లై చేయండి. దీన్ని అప్లై చేయడానికి, శుభ్రమైన మస్కరా బ్రష్ లేదా కాటన్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా ఇలా అప్లై చేయడం వల్ల కనురెప్పలు బలంగా , మందంగా మారతాయి.
2. జుట్టు రంగు :
జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు రంగు వివిధ భాగాలకు అంటుతుందనే భయం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. జుట్టుకు రంగు వేసుకునే ముందు, వెంట్రుకలు, చెవులు, మెడలపై వాసెలిన్ రాయండి. ఇలా చేయడం వల్ల హెయిర్ డై చర్మానికి అంటుకోదు. ఒక వేళ అంటినా కూడా సులభంగా తొలగించుకోవచ్చు.
3. క్యూటికల్స్ ను మృదువుగా చేయడానికి:
మీ గోళ్లను చక్కని ఆకారంలో, అందంగా ఉంచుకోవడం కోసం వాసెలిన్ ఉపయోగించవచ్చు. మీ గోళ్ల క్యూటికల్స్ ఎండిపోయి ఉంటే మీరు వాసెలిన్ అప్లై చేయడం వల్ల మృదువుగా మారతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు గోళ్లు,క్యూటికల్స్‌పై వాసెలిన్ రాయండి. కొన్ని రోజుల్లోనే గోర్లు ఆరోగ్యంగా , మెరుస్తూ కనిపిస్తాయి.
4. మేకప్ రిమూవర్‌గా:
మీ దగ్గర మేకప్ రిమూవర్ లేకపోతే వాసెలిన్ మీకు ఒక గొప్ప ప్రత్యామ్నాయం కావచ్చు. కాటన్ ప్యాడ్ మీద కొద్దిగా వాసెలిన్ తీసుకుని మేకప్ తుడవండి.
ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. అంతే కాకుండా పొడి బారకుండా నిరోధిస్తుంది.
5. మృదువైన పెదవుల కోసం:
పగిలిన పెదవుల సమస్యను తగ్గించడానికి వాసెలిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పడుకునే ప్రతి రోజు కాస్త పెదవులపై వాసెలిన్ రాయండి. ఇది పెదవులను హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా షైనీగా మారుస్తుంది.
6. బ్లాక్ హెడ్స్ తొలగించడానికి:
బ్లాక్ హెడ్స్ తొలగించడానికి వాసెలిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముక్కు మీద వాసెలిన్ రాసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం చేతులతో సున్నితంగా మసాజ్ చేసిన తర్వాత కడిగేయండి. ఇది బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని తేమగా మారుస్తుంది.
7. పగిలిన మడమల కోసం:
పగిలిన మడమలను నయం చేయడంలో వాసెలిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట పాదాలను కడిగి, వాసెలిన్ రాసుకుని, సాక్స్ ధరించండి. ఇలా చేయడం వల్ల మీ మడమలు కొన్ని రోజుల్లో మృదువుగా మారతాయి.
Also Read: ఈ స్క్రబ్ ఒక్కసారి వాడితే చాలు.. అమ్మాయిలు అసూయపడే అందం
8. కనుబొమ్మలకు:
మీ కనుబొమ్మలు మందంగా లేకపోతే మీరు వాసెలిన్ ఉపయోగించవచ్చు. ప్రతి రోజు రాత్రి కొద్దిగా వాసెలిన్ తీసుకుని కనుబొమ్మలపై అప్లై చేయండి.
దీనివల్ల కనుబొమ్మలు మరింత మెరుస్తూ కనిపిస్తాయి. ఇలా వాసెలిన్ చర్మ సౌందర్యం కోసం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.