Jabardasth Dhanraj : ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది కమెడియన్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించిన ఘనత జబర్దస్త్ షో కి ఉంది. కేవలం కమెడియన్స్ ను మాత్రమే కాకుండా దర్శకులను కూడా అందించింది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించిన వేణు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొన్ని ఎపిసోడ్స్ చేశాడు. కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. జబర్దస్త్ షో మొదలైనప్పుడు ఆల్రెడీ సినిమాల్లో పేరు సాధించిన వాళ్లను తీసుకొచ్చి ఆ షో ను నడిపించారు. ఆ షో ఈ కమెడియన్స్ కి సినిమాల్లో రాని గుర్తింపును తీసుకొచ్చింది. ఈ షో కి సంబంధించి ఎంత ఆదరణ లభించిందో అదే స్థాయిలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ఉన్న జబర్దస్త్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. హెల్దీ కామెడీ పూర్తిగా తప్పిపోయింది.
ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న వేణు దర్శకుడుగా బలగం అనే సినిమాను చేశాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కమెడియన్ లో ఇంత ఎమోషన్ ఇంత లోతు దాగి ఉంది అని ఆ సినిమాతో చాలామందికి అర్థం అయింది. చాలామంది ఆ సినిమాను ఊళ్ళల్లో తెర బొమ్మలు వేసుకొని మరీ చూశారు. చాలామందికి ఒక దారి చూపించాడు కమెడియన్ వేణు. ఇప్పుడు వేణు బాటలో దర్శకులుగా ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది కమెడియన్స్ అడుగులు వేస్తున్నారు అని చెప్పాలి. జబర్దస్త్ షో తో గుర్తింపు సాధించుకున్న ధనరాజ్ కూడా ఇప్పుడు రామం రాఘవం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అని బలంగా నమ్ముతుంది చిత్ర యూనిట్.
ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ కి సంబంధించి ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుడు ఒక ఎమోషన్ కి కనెక్ట్ అయ్యాడు అంటే ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఇదివరకే చాలా సినిమాలు రుజువు చేశాయి. ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ పృథ్వి పోలవరపు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆ నలుగురు, మాతృదేవోభవ వంటి సినిమాల ఈ సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ సినిమా మీదైతే మంచి పాజిటివ్ టాక్ ఉంది. సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో ధనరాజు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కి గురి అయ్యారు. సముద్రఖని గారు నాకు తండ్రిగా నటిస్తున్నారు. నటించిన ఆయనకు ప్రాబ్లం లేదు కానీ చాలామంది ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతుంటే నాకు ఏడవాలనిపించింది, ఎప్పుడు ఏడవనంతగా ఏడవాలి అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
ధనరాజ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడుతూ మంచి రెస్పెక్ట్ పొందుకున్నాడు. అలానే ఒక సినిమా ఒక కుటుంబాన్ని ఇస్తుంది అని నాకు ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఈ సినిమా నాకు అమ్మానాన్నలను ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అలానే తను ఎదుగుతున్న క్రమంలో చాలా మంది తనను లాగుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ధనరాజు సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు ట్రోల్ చేసిన వల్లే ఇప్పుడు ట్రైలర్ చూసి ప్రశంసిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు ధనరాజ్. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాకి ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
Also Read : RGV : నేను అది చెయ్యకపోతే.. డెన్ కు వచ్చి చెప్పుతో కొట్టండి