BigTV English

Free Fire Game – Eluru: ఆన్‌లైన్ గేమ్ వివాదం.. చితకొట్టుకున్న విద్యార్థులు, చివరికి..

Free Fire Game – Eluru: ఆన్‌లైన్ గేమ్ వివాదం.. చితకొట్టుకున్న విద్యార్థులు, చివరికి..

Free Fire Game – Eluru: విద్యార్థులు గుమిగూడారు. చిత్తుచిత్తుగా పోట్లాడుకున్నారు. అది కూడా గుంపులు గుంపులుగా ఎగబడి మరీ కేకలు వేస్తూ నానా దుర్భాషలాడుతూ ఇష్టారీతిన హల్చల్ చేశారు. చివరకు స్థానికులు వచ్చారు. ఇరువర్గాల విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఘర్షణకు గల కారణం తెలుసుకున్న స్థానికులు.. ఔరా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో బుధవారం జరిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పోలీసులు కూడా స్పందించారు.


నేటి విద్యార్థులలో ఆన్ లైన్ గేమ్స్ అంటే తెలియని వారే ఉండరు. అంతేకాదు 5 వ తరగతి చదివే విద్యార్థులు సెల్ ఫోన్ వాడకంలో వారికి వారే సాటిగా చెప్పవచ్చు. అందుకే నేటి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలకు బదులుగా సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయని అంటుంటారు. ఆన్ లైన్ క్లాసుల విధానం మొదలైన సమయంలో విద్యార్థులకు మొబైల్ తప్పనిసరిగా మారింది. అలా మొబైల్ వాడకంపై మోజు పెంచుకున్న విద్యార్థులు.. చిన్నగా ఆన్ లైన్ గేమ్స్ బాట పట్టారు. పాఠశాలకు వెళ్ళి రావడం, ఆ తర్వాత మొబైల్ చేతిలో పట్టుకోవడం.. తల్లిదండ్రులు ఏంటి అని ప్రశ్నిస్తే, ఆన్ లైన్ వర్క్ అంటూ కొందరు విద్యార్థులు చెబుతున్న పరిస్థితి. కానీ అక్కడ జరిగే అసలు నిర్వాకం వేరే.

ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్ ద్వారా జట్టుగా ఏర్పడి యువత మొబైల్ లో గేమ్స్ ఆడుతున్న పరిస్థితి. ఈ ఆట ఆడే సమయంలో ఎవరైనా పిలిచినా పలకని స్థితిలో ఆటలో నిమగ్నమవుతూ ఉంటారు. అంతేకాదు ఇలాంటి ఆన్ లైన్ గేమ్స్ బారిన పడిన ఎందరో విద్యార్థులు, మానసిక వ్యాధులతో ఇబ్బందులకు గురైన వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్ లైన్ గేమ్ కారణంగా విద్యార్థులు పోట్లాడుకొనే పరిస్థితులు వచ్చాయంటే, వీరిపై ఈ గేమ్స్ ప్రభావం ఏమేరకు ఉందో చెప్పవచ్చు. ఇలాంటి ఘటనే ఏపీలోని ఏలూరులో జరిగింది.


ఏలూరులో ఫ్రీ ఫైర్ గేమ్ కారణంగా రెండు వర్గాలుగా ఏర్పడ్డ విద్యార్థులు తగాదా పడ్డారు. ఫ్రీ ఫైర్ గేమ్ లో బెట్టింగ్ కాశారో ఏమో కానీ, గేమ్ కారణంగా మొదలైన చిన్న వివాదం.. ఎదురెదురు దాడులకు దారి తీసింది. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. స్థానికులకు అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కొద్ది క్షణాలు ఆ ప్రాంతం భయానకంగా మారింది. చివరకు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రెండు వర్గాల విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read: Chandrababu-Pawan: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రులతో భేటీ

ఆన్ లైన్ గేమ్ కోసం సమరాన్ని తలపించిన విద్యార్థుల కొట్లాటను చూసి స్థానికులు నివ్వెరపోయిన పరిస్థితి. ఈ దాడులను చూసిన కొందరు.. విద్యార్థులపై కఠినచర్యలు తీసుకోవడంతో పాటు వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఏదిఏమైనా ఆన్ లైన్ గేమ్స్ ప్రభావం నేటి యువతపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చెప్పేందుకు, ఈ దాడులే చక్కని ఉదాహరణగా విద్యావేత్తలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆన్ లైన్ గేమ్స్ బారి నుండి రక్షించుకోవాలని వారు కోరుతున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×