BigTV English

After Lunch: తిన్న వెంటనే ఈ 5 పనులు చేశారంటే అంతే సంగతులు, త్వరగా జబ్బు పడతారు

After Lunch: తిన్న వెంటనే ఈ 5 పనులు చేశారంటే అంతే సంగతులు, త్వరగా జబ్బు పడతారు

రోజులో ముఖ్యమైన పని భోజనం చేయడం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే శరీరానికి శక్తి వస్తుంది. ఆ రోజంతా మీరు ఏదైనా పనులు చేయగలరు. ఆహారం లేకుండా శరీరం ఎక్కువ కాలం జీవించలేదు. అందుకే ముఖ్యమైన విధుల్లో భోజనం చేయడం కూడా ఒకటి. అయితే భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఎంతోమంది ఈ విషయాలపై అవగాహన లేక భోజనం చేసిన వెంటనే ఆ పనులు చేసేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి తెలియకుండానే వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి. లేదా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. భోజనం చేసిన వెంటనే ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.


తిన్న వెంటనే స్నానం
భోజనం చేసిన వెంటనే కొంతమంది స్నానానికి వెళుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా మందికి హానికరంగా మారవచ్చు. అదే శరీరంపై చెడు ప్రభావాలను చూపిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి రక్తప్రసరణ సవ్యంగా ఉండాలి. అయితే మీరు తిన్న వెంటనే స్నానం చేస్తే ఆ నీటి చల్లదనానికి రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేయడం మొదలవుతుంది. దీనివల్ల పొట్టలో ఆహారం భారంగా మారుతుంది. సమస్యలు కూడా మొదలవ్వచ్చు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం మంచిది కాదు. ఆహారం తిన్నాక అరగంట నుంచి గంటపాటు ఉన్నాక ఆ తర్వాత స్నానం చేయండి.

స్పీడ్ వాక్ వద్దు
భోజనం చేశాక తేలికపాటి నడక ఆరోగ్యానికి మంచిదే. కానీ కొంతమంది ఆహారం త్వరగా జీర్ణం కావాలని వేగంగా నడుస్తూ ఉంటారు. ఈ పద్ధతి పొట్టలో జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల నీరసం రావచ్చు. వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. తిన్న తర్వాత గంటసేపు ఎలాంటి వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఒకవేళ నడవాలి అనుకున్నా కూడా నెమ్మదిగా అడుగుల వేస్తూ తేలికపాటి నడకను కొనసాగించాలి. స్పీడ్ వాక్ మాత్రం చేయకూడదు.


నిద్ర వద్దు
తిన్న తర్వాత భుక్తాయాసంతో కొంత మందికి నిద్ర వచ్చేస్తుంది. భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ అలా పడుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పొట్టలోని ఆమ్లం మీ అన్నవాహికలోకి వెళ్లి మంట మొదలవుతుంది. దీన్నే గుండెల్లో మంట అని అంటాము. మీకు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే నిటారుగా కూర్చుని సోఫాలోనే విశ్రాంతి తీసుకోండి. అప్పుడు ఆమ్లం అన్నవాహికలోకి వెళ్లకుండా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట రాకుండా ఉంటాయి. భోజనం తిన్న తర్వాత వెంటనే మంచంపై చేరబడి పోకండి.

టీ లేదా కాఫీ తాగడం
ఎంతోమందికి ఉన్న అలవాటు భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం. దీనివల్ల వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. నిజానికి ఇలా చేయడం ఆరోగ్యానికి నష్టం చేసుకోవడమే. శరీరంలో ఇనుముతో పాటు ముఖ్యమైన ఖనిజాలను గ్రహించే సామర్థ్యం పై ఇది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. టీ లో టానిన్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని ఇనుమును శోషించుకోకుండా ఆటంకం కలిగిస్తాయి. శరీరంలో ఇనుము లోపం ఉంటే రక్తహీనత సమస్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే టీ తాగడం వంటి పనులు చేయకండి.

సిగరెట్ వద్దు
భోజనం చేశాక చాలామంది సిగరెట్ పట్టుకొని బయటికి వెళ్లిపోతారు. ధూమపానం అలవాటు ఎంతో మందిలో ఉంది. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ దెబ్బతింటుంది. ధూమపానం జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తుంది. పొట్టలోని ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పొట్టలో ఎక్కువ ఆమ్ల ఉత్పత్తికి దారితీస్తుంది. కాబట్టి ధూమపానం పూర్తిగా మానేయండి.

Related News

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×