BigTV English

Cockroaches: ఇంట్లో బొద్దింకలు చేరితే వెంటనే ఈ చిన్న చిట్కాలతో బయటకి తరిమేయండి

Cockroaches: ఇంట్లో బొద్దింకలు చేరితే వెంటనే ఈ చిన్న చిట్కాలతో బయటకి తరిమేయండి

ఒకప్పుడు ఎక్కువగా పెద్ద బొద్దింకలు కనిపించేవి. ఇప్పుడు సింకులు, కిచెన్లలో అధికంగా చిన్న బొద్దింకలు కనిపిస్తున్నాయి. అవి ఒక్కసారే అధిక స్థాయిలో పిల్లలను పెట్టి తమ సంతతిని వృద్ధి చేస్తాయి. దీనివల్ల అవి అన్ని చోట్ల తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలపై అవి తిరుగుతూ ఉంటే వాటి వ్యర్ధాలన్నీ ఆహారంలోనే పడతాయి. అందుకే ఇంటిని బొద్దింక రహితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం అధికం. బొద్దింకల కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యల వస్తాయని వైద్యులు చెబుతున్నారు.


భయంకరమైన ఇన్ఫెక్షన్లు
బొద్దింకలు సింకులలో, బాత్రూంలలో తిరుగుతూ బ్యాక్టీరియా, వ్యాధికారకాలను మోసుకొస్తాయి. తర్వాత ఆహార గిన్నెలపై తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు మనుషులకు వచ్చే అవకాశం ఉంది. కలరా, టైఫాయిడ్ వంటివి వీటి వల్లే వస్తాయని చెప్పుకుంటారు. అలాగే E.కోలి అనే ఇన్ఫెక్షన్ కూడా బొద్దింకల వల్ల వచ్చే అవకాశం ఉంది.

రాత్రి మాత్రమే తిరిగేవి
బొద్దింకలు రాత్రిపూట తిరిగే ప్రాణులు. అవి చీకటిలో తిరిగేందుకు, నివసించడానికి, తినడానికి ఇష్టపడతాయి. పగటిపూట బొద్దింకలు కనిపించడం చాలా తక్కువ. కానీ రాత్రిపూట మాత్రం కిచెన్ లో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇరుకైన ప్రదేశాలలో, చల్లగా ఉండే ప్రదేశాలలో ఇవి తమను దాచి ఉంచుకుంటాయి. గోడ పగుళ్లలో, చాపల కింద కనిపిస్తూ ఉంటాయి. వీటిని బయటికి తరిమేందుకు చిన్నచిట్కాలను మీరు పాటించవచ్చు.


బేకింగ్ సోడాతో
బొద్దింకలకు చక్కెర, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి బేకింగ్ సోడా, చక్కెర కలిపి ఇంటి మూలల్లో అవి తిరిగే చోట వేయండి. అక్కడికి బొద్దింకలు చక్కెరను తినేందుకు వస్తాయి. చక్కెరతో పాటు బేకింగ్ సోడాను కూడా తింటాయి. తర్వాత అవి మరణించే అవకాశం ఎక్కువ. బేకింగ్ సోడా వాటి శరీరాలపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది.

స్ప్రే తయారు చేయండి
కిచెన్లో బొద్దింకల బెడద నుండి బయటపడడానికి ఇంట్లోనే ఒక స్ప్రే ను తయారు చేయొచ్చు. ఇందుకోసం మీరు వెల్లుల్లి, ఉల్లిపాయ రసాన్ని తీయండి. అలాగే అందులో మిరియాల పొడిని కూడా బాగా కలిపి నీళ్లు వేసి స్ప్రే లాగా చేయండి. ఒక బాటిల్లో వేసి ఆ స్ప్రేను కిచెన్ లోని మూలల్లో, వంట పాత్రలపైన కిచెన్ ప్లాట్ ఫామ్ పైన, స్టవ్ పైన చల్లండి. వెల్లుల్లి, ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు గుర్తింపులో ఏమాత్రం ఇష్టపడవు. మిరియాలలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి బొద్దింకలకు చాలా చికాకుగా అనిపిస్తుంది. ఆ బలమైన వాసనకు అవి వంటింట్లో ఉండలేక బయటికి వెళ్లిపోతాయి.

బోరిక్ యాసిడ్ తో
బోరిక్ ఆమ్లం… పౌడర్, జెల్ రూపంలో మార్కెట్లో లభిస్తుంది. ఇది బొద్దింకల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బొద్దింకలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ జెల్ లేదా పౌడర్ ను ధి కిచెన్లో బొద్దింకల ఉండే చోట చల్లేందుకు ప్రయత్నించండి. వాటి పైనుండి బొద్దింకలను నడిచేటప్పుడు ఇది వాటి శరీరానికి అంటుకుంటుంది. తర్వాత బొద్దింకల నాడీ వ్యవస్థ పై దాడి చేస్తుంది. పొట్టలో ఇది విషంగా మారి బొద్దింకల జీవ క్రియకు అంతరాయం కలిగించి వాటిని మరణానికి దగ్గర చేస్తుంది.

బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు కూడా బొద్దింకలను నివారించేందుకు సహాయపడతాయి. వాటిని కాలిస్తే వచ్చే బలమైన వాసన బొద్దింకలకు నచ్చదు. కాబట్టి ఒక్కొక్కసారి వంటింట్లో ఆకులను కాల్చడానికి ప్రయత్నించండి. లేదా ఈ బిర్యానీ ఆకులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఆ పొడిని వంటింట్లో, మూలల్లో బొద్దింకలు ఉండే చోట చల్లండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే బొద్దింకలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతాయి.

వేప నూనె
వేప నూనెలో కూడా బొద్ధింకలను తరిమే లక్షణాలు ఉన్నాయి. వేప నూనె నేరుగా మార్కెట్లో లభిస్తుంది. దాన్ని కొని తెచ్చుకొని బొద్దింకలపై ప్రయోగించండి. వేప నూనెలో ఆజాడిరెక్టిన అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బొద్దింకల హార్మోన్లలో సమతుల్యతను దెబ్బతీస్తుంది. అవి గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వేప నూనెను ఒక బాటిల్లో వేసి సింకుల కింద, గిన్నెల చుట్టూ బొద్దింకలు దాగుండే ప్రదేశాలలో చల్లడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల్లోనే బొద్దింకల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది.

Related News

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Watermelon Seeds: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

Big Stories

×