IND VS AUS: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య ఇవాళ రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ( Rohit Sharma) అద్భుతంగా ఆడిన నేపథ్యంలో భారీ స్కోర్ చేసింది టీమిండియా. చివరలో హర్షిత్ రాణా మెరుపులు మెరిపించాడు. ఏకంగా మూడు బౌండరీలు కొట్టి దుమ్ము లేపాడు హర్షిత్ రాణా ( Harshit Rana). ఈ తరుణంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు నష్టపోయి 264 పరుగులు సాధించింది. ఇక ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లలో గెలవాలంటే 265 పరుగులు చేయాలి.
ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు చేసింది టీమిండియా. అయితే ఇవాళ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను శ్రేయాస్ అయ్యర్ అలాగే రోహిత్ శర్మ ఆదుకున్నారు. శుభమాన్ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు తొందరగానే పెవిలియన్ కు వెళ్లిపోయారు. ఆ సమయంలో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 73 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 61 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ 44 పరుగులతో రాణించే ప్రయత్నం చేశాడు. ఇక కెఎల్ రాహుల్ తో పాటు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు.
మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాఫ్ అయిన నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. 18 బంతుల్లో 24 పరుగులు చేశాడు హర్షిత్ రాణా ( Harshit Rana). ఇందులో మూడు బౌండరీలు ఉన్నాయి. అతనితో పాటు అర్ష దీప్ సింగ్ 13 పరుగులు చేసి రెచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ చివరలో బాగా రాణించిన నేపథ్యంలో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది టీమిండియా. చివరలో హర్షిత్ రాణా అలాగే అర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా 37 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చాలా సీనియర్ ఆటగాడు ఆడినట్లుగానే అద్భుతమైన షాట్లు కొట్టాడు హర్షిత్ రాణా. గత కొన్ని రోజులుగా హర్షిత్ రాణాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో హర్షిత్ రాణా రెచ్చిపోయి ఆడడం.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో విమర్శకుల నోరు మూయించినట్లైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వెనక గౌతమ్ గంభీర్ సెలక్షన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఏది చేసినా కాస్త ఆలస్యంగా అర్థమవుతుందని అంటున్నారు. విరాట్ కోహ్లీ అలాగే గిల్ కంటే ఎక్కువగా హర్షత్ రాణా పరుగులు రాబట్టాడని అంటున్నారు.
4 4 1 4 2 by Harshit Rana against the best white ball spinner of this generation 🔥🔥 pic.twitter.com/MaSzeYVbcc
— KKR Vibe (@KnightsVibe) October 23, 2025