BigTV English

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు
Advertisement

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదల అభిమానులకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. మెగా ఇంటికి మరో కొత్త వారసుడు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన 2012 లోప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెగా కోడలిగా ఉపాసన అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూనే వచ్చింది. లుక్ బాలేదు అని, చరణ్ కి సెట్అవ్వలేదని ఇలా ఎన్నో మాటలు.. ఆ తరువాత పదేళ్లు పిల్లలు కూడా లేకుండా ఉండడంతో వీరికి ఇక పిల్లలు పుట్టరు అని కూడా విమర్శించారు.


ఇక ఆ విమర్శలకు చెక్ పెడుతూ రెండేళ్ల క్రితం ఈ జంటకు క్లింకారా జన్మించింది. అప్పుడే ఉపాసన తాము పిల్లలను ఎందుకు వద్దు అనుకున్నామో క్లియర్ గా చెప్పింది. తమకు పిల్లలను పెంచే సామర్థ్యం వచ్చినప్పుడే, దానికి ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడే తాము పిల్లలకు జన్మనిస్తామని తెలిపింది. ఇప్పుడు వారు ఇద్దరు పిల్లలను పెంచే సామర్థ్యం ఉందని, వారికోసం అన్ని సిద్ధం చేశాకే పిల్లలకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యారు. అందుకే రెండేళ్ల గ్యాప్ తరువాత మరో వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఎప్పటినుంచో ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్న వాటిని మెగా కుటుంబం పట్టించుకోకపోవడంతో అవి రూమర్స్ అని అనుకున్నారు. కానీ, ఈ  దీపావళి రోజున మెగా ఇంట్లో జరిగిన వేడుకల్లో ఉపాసనకు చిన్న ఫంక్షన్ చేసి ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసారు . దీంతో అందరూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ఉపాసన అభిమానులతో షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైంది అంటూ తెలిపింది. ఇక ఈ వీడియోలో అందరూ ఉపాసనకు గంధం పూసి, బొట్టు పెట్టి,బట్టలు పెడుతూ కనిపించారు. దీంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనేది కన్ఫమ్ అయ్యింది.


ఇక మెగాస్టార్ ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు చిరుకు మనవడు పుట్టలేదు. ఇద్దరు కూతుళ్ళకు అమ్మాయిలే. చరణ్ కు మొదటిసారి అమ్మాయే పుట్టింది. ఇక దీంతో ఈసారి చిరుకు కచ్చితంగా మనవడు పుట్టాలి అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చరణ్ కి కూడా వారసుడు పుడితే.. నెక్స్ట్ జనరేషన్ కి మెగా వారసుడు వచ్చినట్టే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్

Chiranjeevi : చిరు కేసుపై కోర్టు షాకింగ్ తీర్పు.. ఇకపై ‘మెగాస్టార్’ ట్యాగ్ వాడొద్దు..

Gummadi Narasaiah: గుమ్మడి నరసయ్యగా శివన్న.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్!

Chiranjeevi:మన శంకర వరప్రసాద్ సెట్లో పెళ్లికానీ ప్రసాద్.. ఇది కదా ఇండస్ట్రీకి కావాల్సింది

Renu Desai: నా పిల్లలను వదిలేసి.. సన్యాసం తీసుకుంటున్నా.. కానీ,

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Big Stories

×