BigTV English

Shravana Masam: శ్రావణమాసంలో మహిళలు ఏ రంగు గాజులు, ఏ రంగు చీర వేసుకుంటే శుభప్రదం?

Shravana Masam: శ్రావణమాసంలో మహిళలు ఏ రంగు గాజులు, ఏ రంగు చీర వేసుకుంటే శుభప్రదం?

శ్రావణమాసం వచ్చిందంటే మహిళలు పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలలో మునిగిపోతారు. శ్రావణమాసంలో వారు చేసే పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని అంటారు. లక్ష్మీదేవిని పూజించే శ్రావణమాసంలో శివుడిని కూడా పూజిస్తారు. అయితే మహిళలు మాత్రం ఎక్కువగా లక్ష్మీదేవి పూజను చేసేందుకే ఇష్టపడతారు. శ్రావణమాసంలోనే వరలక్ష్మీ వ్రతం కూడా వస్తుంది. ఆ రోజున ఇంట్లో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకుంటారు. మహిళలు శ్రావణమాసంలో వారు ఏ రంగు దుస్తులు? ఏ రంగు గాజులు? వేసుకుంటే మంచిదో తెలుసుకోండి.


ఏ రంగు వాడాలి?
శ్రావణ మాసంలో మహిళలు పూజలు చేసేటప్పుడు ఆకుపచ్చ రంగు చీర, ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఎంతో మంచిది. తల్లి గౌరీ దేవికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. అందుకే శ్రావణ మాసంలో ఎక్కువగా ఈ రంగు గాజులను వేస్తే పార్వతీదేవి, లక్ష్మీదేవి, శివుడి ఆశీస్సులు లభిస్తాయని చెప్పుకుంటారు. అంతేకాదు అదృష్టానికి చిహ్నంగా ఆకుపచ్చ గాజులను చెబుతారు. కాబట్టి మీరు ఆకుపచ్చ రంగు చీర, ఆకుపచ్చ రంగు గాజులు వేసుకొని పూజలు చేస్తే ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఖచ్చితంగా అందుతాయి.

ఆకుపచ్చ రంగుతో శుభప్రదం
పెళ్లయిన స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులు తరచూ వేసుకోవడం వల్ల భర్త దీర్ఘాయుష్షుకు, ఆనందం, శాంతి అందించిన వారు అవుతారు. ఆకుపచ్చ గాజులు పచ్చదనానికి, తాజాదనానికి, శ్రేయస్సుకు సంకేతాలు. వాటిని ధరించడం వల్ల మానసికంగా, శారీరకంగా శక్తి పెరుగుతుంది. ఇక పెళ్లి కాని అమ్మాయిలు ఆకుపచ్చ గాజులు ధరిస్తే అతనికి ఆమెకు మంచి వరుడు లభిస్తాడని అంటారు. ఇక పెళ్లయిన వారు ఆకుపచ్చ గాజులు ధరిస్తే వైవాహిక సంబంధంలో ప్రేమ పెరుగుతుందని చెబుతారు.


ఆకుపచ్చ గాజులు కొన్న తర్వాత వెంటనే ధరించకూడదు. మంచి రోజు చూసి చేతులకు వేసుకోవాలి. శ్రావణమాసంలో మొదటి సోమవారం లేదా శుక్రవారం తలకు స్నానం చేసి ఆకుపచ్చ గాజులను ఆ పార్వతీదేవి లేదా లక్ష్మీదేవి వద్ద పెట్టి ఆ తర్వాత ఆ గాజులను ధరిస్తే మంచిది. అలాగే శివుడుని కూడా ధ్యానం చేసుకోవాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ… మనసులో వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆకుపచ్చ గాజులను ధరించాలి. అప్పుడు మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది.

Related News

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Lord Ganesha: వినాయకుడికి.. ఈ వస్తువు సమర్పిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్

Big Stories

×