ప్రతి రోజు కలిసి పని చేసే తోటి ఉద్యోగులతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. రోజువారీ వర్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ గా జరిగిపోతుంది. పక్క వారితో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటే, పని పక్కకు పోవడంతో పాటు లేని సమస్యలు ఎదురవుతాయి. అందుకే, వీలైనంత వరకు ఆఫీస్ లో కూల్ ఉండేందుకు ప్రయత్నించాలి. అయితే, తోటి ఉద్యోగుల మీద తమ కోపాన్ని వెళ్లగక్కాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఓ డే ఉంది. దాని పేరే ‘నేషనల్ స్లాప్ యువర్ కోవర్కర్ డే’. అక్టోబర్ 23న ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఇంతకీ ఈ డే ఎందుకు ఏర్పాటు చేశారు? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నేషనల్ స్లాప్ యువర్ కోవర్కర్ డేను నేషనల్ స్లాప్ యువర్ ఇరిటేటింగ్ కో వర్కర్ డే అని కూడా పిలుస్తారు. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి నుంచి తగ్గించుకునే కారణంతో ఈ రోజు ఏర్పడింది. తనతో పాటు తోటి ఉద్యోగుల మీద కోపాన్ని వెళ్లగక్కేందుకు ఈ డే ఏర్పాటు చేశారు. వారి మీద ఉన్న కోపాన్ని ఈ రోజు ఓ చెంపదెబ్బ ద్వారా బయటపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆఫీస్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఈ రోజును జరుపుకుంటారు. చిన్న చిన్న గొడవలు, నిరాశ నుంచి బయటపడేందు ప్రయత్నిస్తారు.
నేషనల్ స్లాప్ యువర్ కోవర్కర్ డే అనేది చెంప దెబ్బ కొట్టడం గురించి కాదని, మానసిక ఆహ్లాదాన్ని పొందేందుకు రూపొందించబడిందని మానసిక నిపుణుడు డాక్టర్ మైఖేల్ రాస్ వెల్లడించారు. “ఇక్కడ చెంప దెబ్బ కొట్టడం అనేది నిరాశలను వదిలించుకోవడం గురించి.. శారీరకంగా దాడి చేయడం గురించి కాదు” అన్నారు. ఈ రోజు ఉద్యోగులకు ఉండే చిన్న చికాకులను మరింతగా పెంచకుండా హాస్యం ద్వారా రూపుమాపే ప్రయత్నం చేయాలంటున్నారు. స్లాప్ డే రోజు సరదాగా ఆఫీసులో చిలిపి పనులు, ఆట పట్టించడం లాంటి పనులు చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పొందే అవకాశం ఉంటుందంటున్నారు.
⦿ ఆఫీస్ లో ఫ్రెండ్లీ ఫైటింగ్స్ ఏర్పాటు చేయాలి. కోపంతో కొట్టుకోకూడదు.
⦿ ఉద్యోగులు అంతా కలిసి ఫన్నీగా కామెంట్స్ చేసేలా ‘రోస్ట్’ సెషన్ నిర్వహించాలి.
⦿ ఆఫీస్‌లో ఉద్యోగులు ఫన్నీ స్టిక్కీ నోట్స్ పోస్ట్ చేసేలా ‘స్లాప్ బోర్డ్’నే ఏర్పాటు చేయాలి.
⦿ లంచ్ బ్రేక్ లో త్రీ స్టూజెస్ మారథాన్ నిర్వహించాలి.
⦿ అందరూ ఫన్ ను షేర్ చేసుకోవడం ద్వారా టీమ్ మరింత కలివిడిగా పని చేసే అవకాశం ఉంటుంది.
సహోద్యోగులు తన నిరాశల గురించి చెప్పుకుని నవ్వగలిగినప్పుడు, స్నేహ భావాన్ని మరింత పెంచుతుంది. మనందరం కలిసి ఉన్నాం అనే స్పిరిట్ ను కలిగిస్తుంది. సహోద్యోగుల మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఈ రోజు అడ్డంకుల నుంచి బయటపడి ఆఫీస్ సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు, ప్రొడక్టివిటీ కూడా గణనీయంగా పెరిగి కంపెనీ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో, మీరూ మీ సహ ఉద్యోగులతో నేషనల్ స్లాప్ యువర్ కోవర్కర్ డే హ్యాపీగా జరపుకోండి!
Read Also: అక్టోబర్ 29 లోపే సెలవులు తీసుకుని ఎంజాయ్ చేసేయ్యండి.. ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిక!