BigTV English

Jagan: సెన్సార్‌ బోర్డు ఎందుకుంది? బాలకృష్ణ, పవన్‌ సినిమాలు అంతకంటే దారుణం – జగన్

Jagan: సెన్సార్‌ బోర్డు ఎందుకుంది? బాలకృష్ణ, పవన్‌ సినిమాలు అంతకంటే దారుణం – జగన్
Advertisement

Jagan: వైసీపీ అధినేత జగన్‌లో టెన్షన్ మొదలైందా? వరుసగా నేతలపై కేసులు నమోదుకావడంతో ఇబ్బందిపడుతున్నారా? ఏదో విధంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారా? అధికారుల రాజీనామాలు అందులో భాగమేనని చెప్పేప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల నుంచి జగన్ నోటి నుంచి ఓకే మాట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ చెబుతున్నారు. దీనిపై ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టారు కూడా. తాజాగా బుధవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్. ఏపీలో శాంతిభద్రతలు లేవన్నారు వైసీపీ అధినేత జగన్. భయానక పరిస్థితులు ఉన్నాయన్నారు.

ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. గతంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచేవారని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేదన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? అంటూ ప్రశ్నించారు. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు గొప్పగా యాక్టింగ్ చేస్తున్నారని అన్నారు.


జగన్ టూర్లలో నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తోందన్నారు. పొలిటికల్ గవర్నెన్స్‌ను టేకోవర్ చేసి నడిపిస్తున్నా రని ఆరోపించారు. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ALSO READ: అమిత్ షాతో చంద్రబాబు భేటీ వెనుక.. మరో గవర్నర్ పదవి?

సీఎంను కలిస్తే సమస్యలు తీరవని ఎవరూ కలవలేదన్నారు. కేవలం మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం పోతుందన్నారు. ఎప్పటి మాదిరిగా మామిడి కోనుగోలు మొదలు అన్నీ అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. వైసీపీ కార్యక్రమాలకు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని, దాన్ని తట్టుకోలేక విపక్షాన్ని అణచివేయాలని చూస్తున్నారన్నారు.

సినిమా డైలాగులు చెప్పినా, పోస్టర్లు ప్రదర్శన చేసినా కేసులు పెడుతున్నారు ఆందోళన వ్యక్తం చేశారు జగన్. ఈ విషయంలో సెన్సార్‌ బోర్డు ఎందుకుంది? సినిమాలు తీయడం ఎందుకని ప్రశ్నించారు. సినిమా డైలాగులతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటంటూ వారిని వెనుకేసుకొచ్చారు. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో అంతకంటే దారుణమైన డైలాగులు ఉన్నాయని, మరి సంగతేంటి? అన్నారు.

డీజీ స్ధాయి అధికారి ఆంజనేయులను అరెస్టు చేశారని గుర్తు చేశారు. సంజయ్, పీవీ సునీల్, కాంతిరాణా టాటా వంటి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేశారన్నారు. చాలా మంది అధికారులను ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు.

నియోజకవర్గాల్లో ఇసుక, మట్టి మాఫియాలు, పేకాట క్లబ్‌లు నడుపుతున్నారని, డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు సేకరించి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారన్నారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్లు, టీవీ ఛానెళ్లపై మండిపడ్డారు. ప్రభుత్వం టార్చర్ భరించలేక సిద్ధార్ధ్ కౌశల్ వంటి అధికారులు వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారని అన్నారు.

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితమని చెప్పే సీఎం చంద్రబాబు, మౌలిక హక్కులు ఏంటో తెలియదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ప్రజలను చైతన్ యవంతుల్ని చేయడం రాజకీయ పార్టీల హక్కు కాదా అని అడిగారు. పేర్ని నాని డైలాగ్స్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు.

 

Related News

NDA Alliance: మాకు లేని ఇగోలు మీకెందుకబ్బా.. కూటమిలో అందరి మాటా అదేనా?

Jagan Assembly: జగన్ అసెంబ్లీ మొదలు.. టైమ్ టేబుల్ ప్రకటించిన వైసీపీ

CM Chandrababu In Dubai: ఫ్యూచర్‌ మ్యూజియం సందర్శన.. అవసరమైతే పాలసీలు మారుస్తాం.. దుబాయ్ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు

Pithapuram Govt Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి.. విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

AP Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

CM Chandrababu: పెట్టుబడుల వేటలో సీఎం చంద్రబాబు.. యూఏఈలో వరుస భేటీలు

Bhimavaram DSP Issue: డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్.. భీమవరం డీఎస్పీ వెరీగుడ్ అంటూ రఘురామ కీలక వ్యాఖ్యలు

TDP On Tuni Incident: తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు.. తుని ఘటనపై టీడీపీ సంచలన పోస్ట్

Big Stories

×