నల్లటి వస్తువులు
ప్రేమికుల రోజు వారం ముందే ప్రారంభమైపోతుంది. వాలెంటెన్స్ వారంలో ప్రేమ జంటలు ఒకరికొకరు పూలు, చాక్లెట్లు, టెడ్డీబేర్లు వంటి బహుమతిగా ఇచ్చుకుంటారు. ఇక వాలంటైన్స్ డే రోజు మీ భాగస్వామికి ఇచ్చేందుకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన వస్తువును కొనే ఉంటారు. అయితే ఆ వస్తువు నలుపు రంగులో ఉండకుండా చూసుకోండి. నలుపు రంగు దుస్తులు, నలుపు రంగు హ్యాండ్ బ్యాగ్, పర్సులు వంటివి బహుమతిగా ఇవ్వకండి. నలుపు రంగు ప్రతికూలతతో ముడిపడి ఉంటుంది. ఆ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల బంధం విడిపోయే అవకాశం ఉంటుంది. మీ బంధంలో చేదు సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
పదునైన వస్తువులు
ప్రేమికుల రోజున మీ భాగస్వామికి పదునుగా ఉండే ఏ వస్తువును ఎంపిక చేయకండి. మీరు ఇచ్చే బహుమతి అంచులు పదునుగా లేకుండా చూసుకోండి. దీనివలన మీ సంబంధంలో చీలికలు రావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరూ కూడా ఎవరికి పదునైన వస్తువులు ఇవ్వకూడదు. అలాగే రుమాలు వంటివి కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడండి. రుమాలు ఇవ్వడం వల్ల కూడా అనుబంధం తెగిపోయే అవకాశం ఉంది.
ఫుట్ వేర్
ప్రేయసి ప్రియులు తమ భాగస్వామికి ఉపయోగపడే వస్తువునే ఇవ్వాలనుకుంటారు. అందుకోసం వారు వాడే వస్తువులను చూస్తూ ఉంటారు. ముఖ్యంగా దుస్తులు, చెప్పులు, ఇయర్ రింగ్స్ వంటివి ఎంపిక చేసుకుంటారు. పాదరక్షలు వంటివి ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం చాలా అశుభం. ఇది వారి సంబంధంలో చిచ్చును రేపుతుంది. అలాగే కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను కూడా బహుమతిగా ఇవ్వకూడదు. అవేవీ మంచిని చేయవు.