సాంబార్ అంటే ఎంతో మందికి ఇష్టం. వారంతో రెండు మూడు సార్లు సాంబార్ చేసుకుని తినే వారు ఎంతో మంది. తెలుగువారు సాంబార్ ఒక పద్ధతిలో చేస్తారు. అదే కేరళవాళ్లు మరొలా చేస్తారు. ఈ కేరళ స్టైల్ లో చేసే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేసే పద్ధతి కూడా చాలా సులువు
కావలసిన పదార్థాలు
కందిపప్పు – అర కప్పు
ఎర్ర కందిపప్పు – అరకప్పు
ఇంగువ – చిటికెడు
ములక్కాడలు – రెండు
దోసకాయ – అర ముక్క
వంకాయలు – రెండు
బెండకాయలు – ఏడు
బీన్స్ – ఏడు
కొత్తిమీర తరుగు – అరకప్పు
టమోటో – రెండు
చిన్న ఉల్లిపాయలు – పది
సాంబార్ పొడి – మూడు స్పూన్లు
ఆవాలు – ఒక స్పూను
ఆయిల్ – రెండు స్పూన్లు
చింతపండు – నిమ్మకాయ సైజులో
పచ్చిమిర్చి – రెండు
ఎండుమిర్చి – మూడు
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
కేరళ స్టైల్ సాంబార్ రెసిపీ
ఈ సాంబార్లో వేడి వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది అలాగే ఇడ్లీతో కూడా తినవచ్చు దీన్ని తిన్న కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కేరళ స్టైల్ లో చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఎర్ర కందిపప్పు సాధారణ కందిపప్పు కలపడం వల్ల కొత్త రుచి సాంబార్ కు వస్తుంది.
Also Read: అరటి పండును తొక్కతోపాటు తినేస్తే ఏమవుతుంది?
సాంబార్లో ఎన్నో రకాల కూరగాయలు, పప్పు దినుసులు వంటివి ఉంటాయి. కాబట్టి దీని నుండి మనకు అనేక రకాల పోషకాలు అందుతాయి. దీని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కసారి ఇలా కేరళ స్టైల్ లో సాంబారు చేసుకుని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. ఇలా సాంబార్ చేసుకున్నప్పుడు పక్కన బంగాళదుంప ఫ్రై ఉంటే ఆ కాంబినేషన్లో కూర అదిరిపోవడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం. ఈరోజే ఈ రెండింటి కాంబినేషన్లో తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.