BigTV English

Hyderabad: ఓగా వెల్‌నెస్ సెంటర్‌లో ఇప్పుడు ఈ సర్వీసులు కూడా.. మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం

Hyderabad: ఓగా వెల్‌నెస్ సెంటర్‌లో ఇప్పుడు ఈ సర్వీసులు కూడా.. మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం

Hyderabad: ఈమధ్య కాలంలో చాలామంది తమ శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్ల సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ఉన్న వెల్‌నెస్ సెంటర్లలో గచ్చిబౌలీలోని ఓగా వెల్‌నెస్ సెంటర్ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ సెంటర్‌లో ఫిజియోథెరపీ, డెంటల్, ఫేషియల్ ఎస్తటిక్స్ సర్వీసులను కూడా లాంచ్ చేశారు. ఈ లాంచ్ కార్యక్రమం కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు రిబ్బన్ కట్ చేయగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సర్వీసులను లాంచ్ చేశారు.


ఘనంగా వేడుకలు

లాంచ్ కార్యక్రమానికి రావడంతో పాటు ఫిజియోథెరపీ, డెంటల్, ఫేషియల్ ఎస్తటిక్స్ అండ్ సర్వీసుల గురించి అడిగి తెలుసుకున్నారు ఉత్తమ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు. దాంతో పాటు ఓగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ మొదటి సంవత్సరం యానివర్సరి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా హాజరయ్యారు. వారితో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ వేడుకల్లో జాయిన్ అయ్యారు. మిసెస్ ఏసియా పసిఫిక్ శిల్పా కటారియా సింగ్ కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యింది.


ఉపయోగకరమైన ఆలోచన

ఓగా వెల్‌నెస్ సెంటర్‌లో కొత్త సర్వీసులు ప్రారంభించిన తర్వాత వీటిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్‌పైన ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, తాను ఎయిర్ ఫోర్స్‌లో ఉండడం వల్ల ఫిట్‌నెస్, హెల్తీ లైఫ్ స్టయిల్‌పై ఫోకస్‌గా ఉంటానన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ కోసం ఇలాంటి ఒక సెంటర్ రావడం చాలా ఉపయోగకరమని అన్నారు. ఓగా వెల్‌నెస్ సెంటర్‌లో ఇవి మాత్రమే కాకుండా మోడ్రన్ జిమ్, స్పా, యోగా, ఎస్తటిక్ బ్యూటీ స్కిన్ సర్వీసులు కూడా అందుబాగులో ఉన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటి జనరేషన్ బిజీ లైఫ్‌స్టైల్‌తో స్ట్రెస్ ఫీలవుతుంటారని, అలాంటి వారికోసం ఇలాంటి వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

Also Read: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ.. ఏయే ప్రాంతాల మీదుగా అంటే..

మరిన్ని ఏర్పాటు కావాలి

ఈరోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని అన్నారు. ముఖ్యంగా స్కిన్ హైయిర్, ఫిట్‌నెస్, డైట్స్, డెంటల్ సమస్యలు.. ఇలా ఏ హెల్త్ సమస్యకు అయినా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్‌ను అందిస్తున్న ఓగా నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి వెల్‌నెస్ సెంటర్లు చాలా అవసరమని అన్నారు. తనతో పాటు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన శిల్పా కటారియా కూడా ఈ వెల్‌నెస్ సెంటర్ల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. మిసెస్ ఏషియా పసిఫిక్ శిల్పా కటారియా ప్రతి ఒక్కరి జీవితంలో శారీరిక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపారు.

Related News

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

Big Stories

×