BigTV English

Shanku Pushpam: ఈ నీలి తెలుపు అపరాజిత పువ్వులను ఇలా ఉపయోగించారంటే మీకు జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది

Shanku Pushpam: ఈ నీలి తెలుపు అపరాజిత పువ్వులను ఇలా ఉపయోగించారంటే మీకు జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది

శంఖు పుష్పాలు అంటే శివుడికి ఎంతో ఇష్టం. శంఖుపుష్పాలతో పూజ చేస్తే శివుడు కరుణిస్తాడని చెబుతారు. శంఖు పుష్పాలతో చేసే టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పుష్పాలతో జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. జుట్టును నల్లగా, పొడవుగా పెరిగేలా చేసేందుకు శంకు పుష్పాలు ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. తలలో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడానికి శంఖు పుష్పాలు ఉపయోగపడతాయి.


శంఖు పుష్పాలను ఉపయోగించడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. దీనిలో శీతలీకరణ లక్షణాలు ఎక్కువ. కాబట్టి చుండ్రు నుంచి మనల్ని బయటపడేస్తుంది. అలాగే జుట్టుకు మృదుత్వాన్ని అందిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి తలకు ఉపశమనంగా అనిపిస్తుంది. కాబట్టి శంకు పుష్పాలను ఉపయోగించి జుట్టును పెంచుకోవడంతో పాటు ప్రశాంతతను పొందవచ్చు.

శంఖు పుష్పాల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందలంటే దాన్ని ముందుగా నూనె రూపంలోకి మార్చుకోవాలి. నేరుగా శంఖు పుష్పాల నూనెను కొనుగోలు చేసుకోవచ్చు. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు శంఖు పుష్పాలను ముందుగా ఎండబెట్టుకోవాలి. లేదా తాజా పువ్వులను తీసుకున్నా మంచిదే. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక కప్పు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వేయాలి. ఇప్పుడు అందులో ఎండిపోయిన శంఖు పుష్పాలను వేసి మరిగించండి. లేదా తాజాగా ఉన్నవి వేసినా మంచిదే. చిన్న మంట మీద వీటిని మరిగించాలి. అందులోనే మెంతి గింజల పొడి, 5 చుక్కల రోజ్మేరీ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని వడకట్టి ఒక సీసాలో వేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెతో తలపై మసాజ్ చేయడానికి ఉపయోగించండి. ఆ తర్వాత హెర్బల్ షాంపుతో జుట్టును కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. జుట్టు మూలాలు బలంగా మారుతాయి. తలలో ఒత్తిడి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది.


శంకు పుష్పాల పొడిని ఉపయోగించి తయారుచేసిన హెయిర్ మాస్క్ తలకు డీప్ కండిషనింగ్ ఇస్తుంది. అలాగే డిటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలంటే శంఖు పుష్పాలను ముందుగానే ఎండబెట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిలోంచి రెండు టేబుల్ స్పూన్ల పొడిని ఒక గిన్నెలో వేయాలి. అందులోనే ఒక స్పూన్ పెరుగు లేదా కలబంద జెల్ వేయాలి. ఉసిరి పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్టును తల మొత్తానికి మాడుకు అంటే ఎలా రాసుకోవాలి. కనీసం గంట పాటు దాన్ని అలా వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ ను తరచూ వేయడం వల్ల తలపై ఉన్న చర్మం శుభ్రపడుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బలంగా మారుతాయి. జుట్టు పెరుగుదల కూడా వేగవంతమవుతుంది.

శంఖు పుష్పాలను నోటిద్వారా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందుకోసం మీరు శంఖు పుష్పాల సిరప్ ను తయారు చేసుకోవాలి. లేదా శంఖు పుష్పలతో టీ చేసుకుని తాగినా మంచిదే. ఇలా చేసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్త శుద్ధి కూడా జరుగుతుంది. పరోక్షంగా జుట్టు పెరుగుదలకు ఇవన్నీ సహాయపడతాయి. ఇందుకోసం మీరు ఒక గ్లాసులో గ్లాసు నీటిని గిన్నెలో వేయాలి. అందులో తాజా సంకు పుష్పాలను వేసి బాగా మరిగించాలి. దాన్ని వడకట్టి అది గోరువెచ్చగా అయ్యేవరకు వేచి ఉండాలి. ఇప్పుడు అందులో తేనెను కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు దొరుకుతాయి.

శంఖు పుష్పాలను ఇతర ఆయుర్వేద మూలికలతో కలిపి తీసుకుంటే ఇంకా రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయి. బ్రాహ్మితో కలిపి శంఖు పుష్పాలను వాడడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జుట్టు కూడా అధికంగా ఎదుగుతుంది. అలాగే బృంగ్ రాజ్ అని పిలిచే మూలికల రాజును కూడా శంఖపుష్పాలతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఉసిరి పొడిని శంఖ పుష్పాల పొడితో కలిపి టీ లేదా సిరప్ చేసుకొని తాగితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి. ఇందులో విటమిన్ సి జుట్టుకు శక్తిని అందిస్తుంది. ఇక అశ్వగంధ పొడిని శంఖు పుష్పాల టీలో వేసుకొని తాగడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ఒత్తిడి ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×