Urvashi Rautela: హీరో, హీరోయిన్స్‌ను పోలుస్తూ ప్రేక్షకులు ఫ్యాన్ వార్స్ చేయడం చాలా కామన్. అలాగే హీరో, హీరోయిన్స్ కూడా తమను తాము వేరే నటీనటులతో పోల్చుకుంటూ వారికంటే బెటర్ అవ్వాలని ఫీలవుతూ ఉంటారు. అలా చాలామంది నటీనటుల మధ్య ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఎక్కువగా ఎవరూ బయటపడరు. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య ఈ కోల్డ్ వార్ అనేది కామన్. ఒకరికంటే మరొకరు ఎక్కువ అందంగా కనిపించాలని, ఎక్కువమంది ప్రేక్షకులను అట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా ఊర్వశీ రౌతెలా కూడా తనను తాను తమన్నాతో పోలుస్తూ పోస్ట్ షేర్ చేసింది. ఏమైందో ఏమో గానీ వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ కూడా చేసింది.
కాన్ఫిడెన్స్ పెరిగింది
ఐటెమ్ గర్ల్‌లాగానే కాకుండా పలు సినిమాల్లో నటిగా కూడా ప్రేక్షకులను అలరించింది ఊర్వశీ రౌతెలా (Urvashi Rautela). బాలీవుడ్‌లోనే కాదు.. ఈమధ్య సౌత్‌లో కూడా ఊర్వశి బాగా బిజీ అయిపోయింది. తెలుగులోనూ పలువురు స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసింది. అలాంటి ఊర్వశీ.. తాజాగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలో కూడా ఊర్వశీ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. అదే ‘టచ్ కియా’. సినిమా ప్రమోషన్స్ సమయానికి ముందుగా ఇదే పాటను విడుదల చేశారు మేకర్స్. అలా ఈ పాట, అందులో ఊర్వశీ స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. రోజురోజుకీ ఈ హీరోయిన్ మరింత హాట్‌గా తయారవుతుందనే కామెంట్స్ కూడా వినిపించాయి. దాంతో ఊర్వశీకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిపోయింది.
పాటల్లో పోలికలు
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఒకవైపు సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు బాలీవుడ్‌లోని ఐటెమ్ సాంగ్స్‌లో అప్పీయరెన్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. తమన్నా చివరిగా ‘స్త్రీ 2’లో చేసిన ‘ఆజ్ కీ రాత్’ అనే ఐటెమ్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తనకు బీ టౌన్ నుండి మరిన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అలా తాజాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘రైడ్ 2’లో కూడా ‘నషా’ అనే ఐటెమ్ సాంగ్‌లో నటించి మెప్పించింది. ఆ సాంగ్ విడుదల అవ్వడం ఆలస్యం వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అలా వైరల్ అవ్వడం ఊర్వశీకి నచ్చలేదనుకుంటా, అందుకే తన పాటను ‘నషా’తో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది.
Also Read: అరుదైన ఘనత దక్కించుకున్న అనన్య.. నెపో కిడ్ లక్ మామూలుగా లేదుగా.!
తనే బెటర్
యూట్యూబ్‌లో ‘టచ్ కియా’ పాటకు ఒక నెటిజన్ చేసిన కామెంట్‌ను ఊర్వశీ రౌతెలా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘ఈ పాట నషాకంటే బెటర్‌గా ఉంది’ అనే కామెంట్‌ను తను అప్లోడ్ చేసింది. దీంతో తమన్నాతో పోల్చుకుంటూ ఊర్వశీ తనకు తాను బెటర్‌గా ఫీల్ అవుతుందంటూ మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఎవరి టాలెంట్ వారిదే అని, అసలు పోలికలు ఎందుకు అని ఫీలయ్యారు. ఆ కామెంట్స్ తనవరకు చేరుకున్నాయో ఏమో.. వెంటనే ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని డిలీట్ చేసింది ఊర్వశీ రౌతెలా. కానీ అప్పటికే ఈ స్టోరీని స్క్రీన్‌షాట్ తీసుకున్న నెటిజన్లు దీనిని తెగ వైరల్ చేస్తున్నారు.
उर्वशी रौतेला में आया घमंड! अपने गाने 'टच किया' को बताया तमन्ना के साॅन्ग 'नशा' से बेहतर, फिर डिलीट कर दिया पोस्ट#UrvashiRautela #TamannaahBhatia #TamannaahBhatiaNasha #BollywoodNews pic.twitter.com/fjJ75jTkCE
— Tadka Bollywood (@Onlinetadka) April 16, 2025