BigTV English

Onion Juice: ఉల్లి రసం తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Onion Juice: ఉల్లి రసం తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా ?

Onion Juice: ఉల్లిపాయలను ప్రతి ఒక్కరి ఇంట్లో ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగడం వల్ల కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఉల్లిపాయ రసంలో ఉండే విటమిన్ ఎ, ఇ, సి, సల్ఫర్. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఉల్లిపాయలో ఉండే పోషకాలు ,యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అంతే కాకుండా వ్యాధులతో పోరాడే సామర్థ్యం కూడా పెంచుతాయి. తరచూ వ్యాధుల బారిన పడే వారు ఉల్లి రసం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ఉల్లిపాయలో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం కోసం ఉల్లి పాయ నీరు తాగడం అలవాటు చేసుకోండి.

జీర్ణ శక్తిని పెంచుతుంది:
ఉల్లిపాయ రసంలో లభించే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అంతే కాకుండా ప్రేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

జలుబు,ఫ్లూ నుండి రక్షిస్తుంది:
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాధారణ జలుబు,దగ్గుతో పోరాడటానికి సహాయపడతాయి.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు:
ఉల్లిపాయలలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

ఉల్లిపాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల సమస్యను తగ్గిస్తాయి.

ఉల్లిపాయ రసం వాడటం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. చుండ్రు కూడా తొలగిపోతుంది.

ఉల్లిపాయ రసంలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేయడానికి, పెరుగుదలను పెంచడానికి సహాయపడతాయి.

ఉల్లిపాయ రసాన్ని ఇలా వాడకూడదు:

ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి ఎప్పుడూ జుట్టుకు అప్లై చేయకూడదు. నిమ్మకాయలో చుండ్రును తొలగించడంలో సహాయపడే ఆమ్లం అయినప్పటికీ, ఉల్లిపాయ రసంతో కలిపి రాస్తే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. ఈ రెండూ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి తల చర్మం యొక్క pH సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది తల చర్మం చికాకు, దురద, పొడిబారడానికి కారణమవుతుంది.

వెనిగర్, ఉల్లిపాయలు రెండూ ఆమ్ల గుణాలు కలిగి ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని పొడిబారి, చికాకు కలిగిస్తాయి. ఇలా వాడటం వల్ల జుట్టు బలహీనంగా మారి, విరిగిపోయి మరింత రాలిపోతుంది.

కొంతమంది జుట్టును కాంతివంతం చేయడానికి లేదా రంగు వేయడానికి బ్లీచ్ ఉపయోగిస్తారు . కానీ మీరు దానిని ఉల్లిపాయ రసంతో కలిపి అప్లై చేస్తే మాత్రం హాని జరుగుతుందని గుర్తించాలి. అది తలకు ,జుట్టుకు తీవ్ర హాని కలిగిస్తుంది. అంతే కాకుండా తలపై మంట పుట్టించే ప్రమాదం కూడా ఉంటుంది. రావచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు యొక్క సహజ బలం కోల్పోయి జుట్టు పొడిగా మారే ప్రమాదం ఉంటుంది.

ఉప్పు:
తలపై చుండ్రు తగ్గించడానికి చాలా మంది ఉల్లిపాయ రసంతో పాటు ఉప్పు కలిపి వాడుతుంటారు. కానీ ఈ మిశ్రమం తలపై చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. అంతే కాకుండా దీని వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది ఎందుకంటే ఉల్లిపాయ రసంలో ఇప్పటికే సల్ఫర్ ఉంటుంది. ఉప్పు కలపడం వల్ల జుట్టుకు మరింత హానికరం అవుతుంది. దీని కారణంగా, తలపై చికాకు, దురద పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×