Anushka Shetty: మామూలుగా హీరోయిన్లు తమ కెరీర్‌లో హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ దగ్గరగానే ఉండాలని అనుకుంటారు. ఒకవేళ వెండితెరపై తమ సినిమాలు వర్కవుట్ అవ్వకపోతే సోషల్ మీడియాతో ఎంటర్‌టైన్ చేయాలని అనుకుంటారు. అంతే కానీ ప్రేక్షకులకు పూర్తిగా దూరమయిపోవాలని ఎప్పుడూ అనుకోరు. కానీ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) అలా కాదు. గత కొన్నేళ్లలో అనుష్క చాలావరకు సినిమాలు తగ్గించేసింది. పైగా తను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ కాదు.. అలాంటిది ఉన్నట్టుండి సోషల్ మీడియాలో కొత్త లుక్‌తో ఒక ఫోటో షేర్ చేసింది స్వీటీ. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా అసలు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు.
కొత్త లుక్
అనుష్క హీరోయిన్‌గా నటించిన చివరి సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ మూవీ ఫీల్ గుడ్ జోనర్‌లో తెరకెక్కి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలాకాలంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన అనుష్క.. చాలాకాలం తర్వాత ఒక యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అనుష్క, నవీన్ పోలిశెట్టి నటన వల్లే ఆ సినిమా అంత బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇలాగే అప్పుడప్పుడు స్వీటీని వెండితెరపై చూస్తే చాలు అని ప్రేక్షకులు అనుకున్నారు. అయినా కూడా ఈ మూవీ తర్వాత అనుష్క మళ్లీ మాయమయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ‘ఘాటీ’ (Ghaati) లాంటి యాక్షన్ మూవీతో మరోసారి ఫ్యాన్స్‌ను పలకరించనుంది. ఇంతలోనే తన న్యూ లుక్‌లో ఫోటో షేర్ చేసి అభిమానులను మరింత హ్యాపీ చేసింది.
రెడ్ శారీలో
మామూలుగా అనుష్కకు తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం, వాటి గురించి అప్డేట్స్ అందించడం పెద్దగా అలవాటు లేదు. అందుకే తన సోషల్ మీడియాలో కూడా తన సినిమాలకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా కనిపించవు. ఒకవేళ తను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా కూడా అది తన గురించి అయ్యిండదు. గత కొంతకాలంగా తన అప్‌కమింగ్ మూవీ ‘ఘాటీ’కి సంబంధించిన అప్డేట్స్ గురించే అప్పుడప్పుడు షేర్ చేసుకుంటోంది అనుష్క. అలాంటిది తాజాగా రెడ్ శారీలో ఒక లుక్‌ను షేర్ చేసింది. అసలు ఈ ఫోటో ఎప్పటిది? ఏ సందర్భంలో దిగింది? లాంటి విషయాలు తెలియకపోయినా చాలాకాలం తర్వాత స్వీటీని చూస్తున్నందుకు ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read: ఛాన్స్ వస్తే అలాంటి సీన్స్ కూడా చేస్తా.. తెలుగమ్మాయి షాకింగ్ స్టేట్‌మెంట్
‘ఘాటీ’ కోసం వెయిటింగ్
క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రమే ‘ఘాటీ’. ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనుష్క స్వయంగా ప్రకటించింది. అనుష్కను ప్రేక్షకులు చూడడం అదే చివరిసారి. అలాంటిది ఉన్నట్టుండి రెడ్ శారీలో ఫోటో చేయడంతో ఇది తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో దిగిన ఫోటో అయ్యిండొచ్చని చాలామంది ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కానీ అప్పుడప్పుడు అనుష్క ఇలా ఫోటోలు షేర్ చేసినా చాలు అని, వాటిని అలా చూస్తూ బ్రతికేయొచ్చు అంటూ భారీ డైలాగులు కొడుతున్నారు ఫ్యాన్స్. ఎలాంటి అడ్డు లేకపోతే ఏప్రిల్ 18న స్వీటీని వెండితెరపైనే చూడొచ్చని ఎదురుచూస్తున్నారు.
New pics aa 🧐🧐 #AnushkaShetty pic.twitter.com/sZgaJ0IaWK
— G Rajesh (@Alwaysgrajesh) February 23, 2025