E-Paper
Advertisement

మన జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

మన జాతీయ జెండా వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
Advertisement

Indian National Flag History:ఆగస్టు 15 వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మన జాతీయ జెండానే కనిపిస్తుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. జెండా కనిపించగానే మనలో కూడా దేశభక్తి ఫీలింగ్ వస్తుంది.

కానీ మనం రోజూ చూసే ఈ త్రివర్ణ పతాకం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఈ జెండా ఎలా వచ్చింది? ఎవరు డిజైన్ చేశారు? అందులో మూడు రంగులే ఎందుకు ఉన్నాయి? మధ్యలో అశోక చక్రం ఎందుకు పెట్టారు? తెలుసుకుందాం.

Advertisement

మన జాతీయ జెండా ఎలా వచ్చింది?

ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు మనకు ఇప్పటిలా ఒక ఫిక్స్‌డ్ జాతీయ జెండా ఉండేది కాదు. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో రకరకాల జెండాలు ఉపయోగించేవారు.

Advertisement

దేశం మొత్తాన్ని ఒక్కటిగా చూపించే ఒక జెండా ఉండాలనే ఆలోచనతో చాలా ప్రయత్నాలు జరిగాయి. అలా కొన్ని మార్పులు చేసుకుంటూ చివరికి ఇప్పుడు మనం చూస్తున్న త్రివర్ణ పతాకం వచ్చింది.

పింగళి వెంకయ్య ఎవరు?

మన జాతీయ జెండా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పింగళి వెంకయ్య.ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.ఆయనే ఇండియాకు ప్రత్యేకమైన జెండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఒక జెండా డిజైన్ చేశారు.

1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తన జెండా నమూనాను మహాత్మా గాంధీకి చూపించినట్లు చరిత్ర చెబుతుంది.అయితే ఇప్పుడు మనం చూస్తున్న జెండా.. పింగళి వెంకయ్య మొదట డిజైన్ చేసిన జెండా సేమ్ టు సేమ్ కాదు. తర్వాత చాలా మార్పులు జరిగాయి.

మన జెండాను ఎప్పుడు ఆమోదించారు?

స్వాతంత్ర్యం రాకముందే మన జాతీయ జెండాకు చివరి రూపం వచ్చింది.1947 జూలై 22న రాజ్యాంగ సభ ప్రస్తుత జాతీయ జెండాను అధికారికంగా ఆమోదించింది.ఆ తర్వాత 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశంలో మన త్రివర్ణ పతాకం తొలిసారి గర్వంగా ఎగిరింది.

మూడు రంగులు ఎందుకు?

మన జెండాలో మూడు రంగులు ఉంటాయి. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.పైన ఉండే కాషాయం రంగు ధైర్యం, త్యాగానికి ప్రతీకగా భావిస్తారు.దేశం కోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడారు. వారి త్యాగాన్ని ఈ రంగు గుర్తు చేస్తుంది.

మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతి, సత్యానికి ప్రతీక.మన దేశం ఎప్పుడూ శాంతిగా, నిజాయితీగా ముందుకు వెళ్లాలనే విషయాన్ని ఇది గుర్తు చేస్తుంది.కింద ఉండే ఆకుపచ్చ రంగు పచ్చదనం, అభివృద్ధికి ప్రతీకగా చెబుతారు.మన దేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను కూడా ఈ రంగు గుర్తు చేస్తుంది.

మధ్యలో అశోక చక్రం ఎందుకు ఉంది?

మన జెండాలో మధ్యలో కనిపించే నీలం రంగు చక్రాన్ని అశోక చక్రం అంటారు.ఇది సారనాథ్‌లోని అశోక సింహ స్థంభంలోని ధర్మచక్రం నుంచి తీసుకున్నారు.ఈ చక్రంలో మొత్తం 24 గీతలు ఉంటాయి.

ఇది ధర్మం, న్యాయం, ఎప్పుడూ ముందుకు సాగడం అనే భావాలను సూచిస్తుంది. చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది కదా.. అలాగే మన దేశం కూడా ఎప్పుడూ ముందుకు వెళ్లాలని చెప్పేలా ఉంటుంది.

మొదట చక్రం బదులు ఏం ఉండేది?

ఇది చాలామందికి తెలియని విషయం.మొదట జాతీయ జెండా డిజైన్లలో చరకా ఉండేది. కానీ తుది జెండా రూపకల్పన సమయంలో చరకా స్థానంలో అశోక చక్రాన్ని పెట్టారు.అలా ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ జెండా రూపం ఫైనల్ అయింది.

జెండాకు కూడా రూల్స్ ఉంటాయా?

అవును. జాతీయ జెండాను ఎలా పడితే అలా ఉపయోగించడానికి వీల్లేదు.జెండాను గౌరవంగా ఉంచాలి. నేలపై పడేయకూడదు. చినిగిన లేదా పాడైన జెండాను ఎగరేయకూడదు. జెండాను అవమానించేలా ఉపయోగించకూడదు.జెండా పొడవు, వెడల్పుకు కూడా 3:2 నిష్పత్తి ఉంటుంది.

ఆగస్టు 15న జెండా ఎందుకు ఎగరేస్తాం?

1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజున ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేసి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.అందుకే ఆగస్టు 15న ఎర్రకోటపై రెపరెపలాడే జెండాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

also read:జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. ఎన్టీఆర్ మీల్ సేవలు క్లోజ్

మన జెండా అంటే కేవలం జెండా కాదు..

మన జాతీయ జెండా అంటే మూడు రంగుల బట్ట మాత్రమే కాదు.దాని వెనుక ఎన్నో పోరాటాలు ఉన్నాయి.. ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి.. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుల కథ ఉంది.కాబట్టి ఈ ఆగస్టు 15న జెండా ఎగరేసేటప్పుడు.. ఒకసారి దాని వెనుక ఉన్న చరిత్రను కూడా గుర్తు చేసుకుందాం.

Tags

Related News

ఆగస్టు 15న ప్రధాని ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చు.. ఎర్రకోటనే ఎందుకు?

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్.. దేశభక్తిని చాటే అద్భుతమైన కోట్స్

ఫ్రిజ్‌లో పెట్టిన పిండి వాడకూడదా? నిపుణులు ఏం చెబుతున్నాంటే?

ఆగస్ట్ 15 ఇంటి డెకరేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

మంచి భర్త అంటే డబ్బులు సంపాదించేవాడు కాదు.. ఇవి ఉన్నవాడే!

ఉదయం 5 గంటలకు లేస్తే నిజంగానే లైఫ్ మారుతుందా?

కేవలం మాటలతోనే ఇతరులను ఆకట్టుకుంటారు.. ఈ రాశుల్లో పుట్టినవారు సూపర్ పర్సనాలటీ

Big Stories

Advertisement
×