E-Paper
Advertisement

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?
Advertisement

Bigg Boss Jodi : బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది జోడిలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ షో ద్వారా కొంతమంది జంటలు కూడా లవ్ ట్రాక్ ని మెయింటైన్ చేశారని వార్తలు వినిపించాయి. హౌస్ లో ఉన్నంతవరకు టిఆర్పి రేటింగ్ కోసం చేసిన కొన్ని టాస్కులు బయటకు వచ్చిన తర్వాత కూడా తమ మధ్య ఉన్న స్నేహాన్ని లేదా ఆ ట్రాక్ ని కొందరు జంటలు కొనసాగించారు. అలాంటి వారిలో రీతు చౌదరి, డిమాన్ పవన్ జంట ఒకటి. ఈ జంట ఎక్కడ కనిపించినా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండేవారు. మా మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ ఎప్పుడూ క్లారిటీ ఇస్తూ వస్తున్న ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. మరి రీతు, పవన్ ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

రీతూ – పవన్ బ్రేకప్ అందుకేనా..? 

బుల్లితెర టాప్ రియాలిటీ షో గా కొనసాగిన బిగ్ బాస్ గురించి ఇప్పటికే పలు రకాల విమర్శలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా హౌస్ లో జంటలుగా కొనసాగిన వారు బయట కూడా కనిపించి జనాలని సందడి చేస్తూ వచ్చారు అలాంటి వారిలో రీతూ చౌదరి అలాగే డిమాన్ పవన్ ఒకరు.. ఈ జంటపై వస్తున్న ఫేమస్ కి తాజాగా చెక్ పెడుతూ డిమాన్ క్లారిటీ ఇచ్చారు. పవన్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.. ఇకపై తమ మధ్య ఉన్న స్నేహ బంధం కూడా పూర్తిగా ముగిసిపోయిందని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు పవన్. తాము ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నామని, బ్లాక్ కూడా చేసుకున్నామని పవన్ పేర్కొన్నాడు. బిగ్బాస్ లో కనిపించేది వేరే లైఫ్ లోకి కనిపించేది వేరు అంటూ పవన్ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ పై నేటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు మరి దీనిపై వీరిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..

రీతూ బ్లాక్ చేసిందా..? 

Advertisement

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంటూ వచ్చిన రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులాటిని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. అందులోనూ పవన్తో కలిసి ఆమె కనిపించిన ప్రతి టాస్కు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వీరిద్దరి మధ్య నిజంగానే రిలేషన్ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే పవన్ తో ఈ మధ్య ఈ అమ్మడు బయట ఎక్కువగా కనిపించడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ ఉంది అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడంతో జనాలు కూడా అయోమయంలో పడ్డారు. అసలు ఏం జరిగింది అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ వీరిద్దరూ రియాక్ట్ అయ్యి ఏదైనా సమాధానం చెప్తే ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఆ క్లారిటీ వస్తుంది ఏమో చూడాలి..

Related News

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×