E-Paper
Advertisement

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!

డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!
Advertisement

Car Dashboard Warning Lights: ప్రస్తుతం మార్కెట్ లోకి అడుగు పెడుతున్న లేటెస్ట్ కార్లలో డాష్‌ బోర్డ్‌ మీద కనిపించే వార్నింగ్ లైట్లు చాలా కీలకమైనవి. కానీ, చాలామంది డ్రైవర్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఈ లైట్లు కారు సమస్యల గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. వాటి అర్థం తెలుసుకుంటే పెద్ద ప్రమాదాలు, పెద్ద రిపేర్ ఖర్చులను తప్పించుకోవచ్చు. కార్లలో సాధారణంగా కనిపించే 10 ముఖ్యమైన వార్నింగ్ లైట్లు గురించి ఇప్పుడు చూద్దాం..

1.చెక్ ఇంజిన్ లైట్

ఇది ఇంజిన్ ఆకారంలో కనిపిస్తుంది. ఇంజిన్, సెన్సార్లలో సమస్య ఉందని సూచిస్తుంది. లైట్ కంటిన్యూయస్ గా వెలిగితే కారు నడిపి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లొచ్చు. కానీ, ఫ్లాష్ అవుతుంటే వెంటనే కారు ఆపడం మంచిది.

2.ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్

Advertisement

థర్మామీటర్ గుర్తుతో కనిపించే ఈ లైట్ ఇంజిన్ ఎక్కువ వేడెక్కిందని చెబుతుంది. కూలెంట్ తక్కువగా ఉండటం,  రేడియేటర్ సమస్య కారణం కావచ్చు. వెంటనే కారు ఆపి ఇంజిన్ చల్లబడే వరకు వేచి ఉండాలి.

3.బ్యాటరీ వార్నింగ్ లైట్

బ్యాటరీ గుర్తు కనిపిస్తే ఛార్జింగ్ సిస్టమ్‌లో సమస్య ఉన్నట్లు అర్థం. ఆల్టర్నేటర్, బ్యాటరీ పనిచేయకపోవచ్చు. ఎక్కువసేపు డ్రైవ్ చేస్తే కారు పూర్తిగా ఆగిపోవచ్చు.

4.ABS వార్నింగ్

Advertisement

ABS అని కనిపించే ఈ లైట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌లో సమస్యను సూచిస్తుంది. సాధారణ బ్రేకులు పనిచేసినా, అత్యవసర బ్రేకింగ్ సమయంలో అదనపు భద్రత ఉండకపోవచ్చు.

5.TPMS లైట్

టైర్ గుర్తులో ఆశ్చర్యార్థకం కనిపిస్తే టైర్లలో గాలి తక్కువగా ఉందని అర్థం. దీన్ని పట్టించుకోకపోతే, టైర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వెంటనే టైర్ ప్రెజర్ చెక్ చేయాలి.

6.ఎయిర్‌బ్యాగ్ వార్నింగ్

సీట్లో కూర్చున్న వ్యక్తి ముందు బాల్ లా కనిపించే గుర్తు ఎయిర్‌ బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య ఉందని సూచిస్తుంది. ప్రమాదం సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోకపోవచ్చు. సో, వెంటనే చెక్ చేయడం మంచిది.

7.డోర్ ఓపెన్ వార్నింగ్

డోర్, బూట్ సరిగా క్లోజ్ కాకపోతే ఈ లైట్ వెలుగుతుంది. హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.

8.లో ఫ్యూయల్ వార్నింగ్

ఫ్యూయల్ పంప్ గుర్తు కనిపిస్తే ఫ్యూయల్ తక్కువగా ఉందని అర్థం. చాలాసేపు ఇలా నడిపితే ఫ్యూయల్ పంప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

9.ట్రాక్షన్ కంట్రోల్ లైట్

జారుతున్న కారు గుర్తు కనిపిస్తే రోడ్డు జారుడుగా ఉందని, ట్రాక్షన్ సిస్టమ్ పనిచేస్తోందని అర్థం. లైట్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటే సిస్టమ్ చెక్ చేయించాలి.

10.పవర్ స్టీరింగ్ వార్నింగ్

స్టీరింగ్ వీల్ గుర్తు కనిపిస్తే పవర్ స్టీరింగ్‌లో సమస్య ఉన్నట్లు అర్థం. స్టీరింగ్ చాలా బరువుగా మారుతుంది. ముఖ్యంగా పార్కింగ్ సమయంలో ఇబ్బంది కలుగుతుంది.

ఈ వార్నింగ్ లైట్లు చిన్న విషయాలు కావు. కారు సమస్యలను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తాయి. సో, డాష్‌ బోర్డ్‌ లో వీటిలో ఏదైనా లైట్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చెక్ చేయించడం మంచిది.

Read Also: అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

Tags

Related News

ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

Big Stories

Advertisement
×