E-Paper
Advertisement

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?
Advertisement

Can Humans Communicate With Aliens: మనిషి ఆకాశం వైపు చూసినప్పుడల్లా చాలా మందిలో ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఈ విశ్వంలో మనమే ఒంటరిగా ఉన్నామా? కోట్లాది నక్షత్రాలు, వాటి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలు ఉన్నప్పుడు.. ఎక్కడో ఒకచోట మనలాంటి తెలివైన జీవులు ఉండే అవకాశం లేదా? ఒకవేళ అలాంటి జీవులు ఉంటే.. వారితో మనం ఎప్పుడైనా మాట్లాడగలమా? ఇప్పటివరకు దీనికి సమాధానం లేదు. కానీ, ఆ సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా వెతుకుతూనే ఉన్నారు.

ఇప్పటివరకు ఏం జరిగింది?

గ్రహాంతర జీవుల కోసం శాస్త్రీయంగా సాగుతున్న అన్వేషణలో సెర్చ్ ఫర్ ఎక్సట్రాటెర్రేస్ట్రియాల్ ఇంటలిజెన్స్(SETI) కీలకమైనది. 1960 నుంచి రేడియో టెలిస్కోపుల సహాయంతో అంతరిక్షం నుంచి వచ్చే అసాధారణ సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా తెలివైన గ్రహాంతర నాగరికత నుంచి వచ్చినట్లు నిర్ధారించగల సిగ్నల్ మాత్రం దొరకలేదు. 1974లో మనుషులు మరో ఆసక్తికరమైన ప్రయత్నం చేశారు. అరెసిబో మెసేజ్ పేరుతో 1,679 బిట్ల సమాచారాన్ని M13 అనే గ్లోబ్యులర్ క్లస్టర్ వైపు పంపించారు. అది అక్కడికి చేరుకోవడానికి దాదాపు 25 వేల సంవత్సరాలు పడుతుంది. అంటే అక్కడి నుంచి సమాధానం రావాలంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే!

అంతరిక్షంలోకి భూమి పరిచయం!

Advertisement

1977లో ప్రయోగించిన వాయేజర్ అంతరిక్ష నౌకల్లో భూమికి సంబంధించిన శబ్దాలు, చిత్రాలు, సంగీతం, భాషలకు సంబంధించిన సమాచారంతో కూడిన గోలెడెన్ రికార్డ్స్ లను కూడా పంపించారు. ఎప్పుడైనా మరో జీవులు ఆ రికార్డును కనుగొంటే.. భూమి గురించి కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక METI, బ్రేక్‌త్రూ లిజన్ లాంటి కార్యక్రమాలు కూడా ఎక్సట్రాటెర్రేస్ట్రియాల్ ఇంటలిజెన్స్ కోసం అన్వేషణను మరింత విస్తరించాయి. ముఖ్యంగా బ్రేక్‌త్రూ లిజన్ భారీ స్థాయిలో నక్షత్రాలను పరిశీలిస్తూ అసాధారణ సాంకేతిక సంకేతాల కోసం వెతుకుతోంది.

మరి ఏలియన్స్ ఎందుకు కనిపించలేదు?

ఇక్కడే ఫెర్మీ పారడాక్స్ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇంత పెద్ద విశ్వంలో జీవం ఉండే అవకాశాలు ఉంటే.. ఇప్పటివరకు మనకు వాళ్ల జాడ ఎందుకు కనిపించలేదు? దీనికి బోలెడు ఊహాగానాలు ఉన్నాయి. గ్రహాంతర జీవులు రేడియో తరంగాలను ఉపయోగించకపోవచ్చు. మనుషులు గుర్తించలేని లేజర్, మరేదైనా సాంకేతిక పద్ధతిని ఉపయోగిస్తూ ఉండొచ్చు. అంతేకాదు, వారు మనుషుల కంటే కోట్ల సంవత్సరాలు ముందుండి ఉండవచ్చు. మరో ఆసక్తికరమైన ఆలోచన జూ ఐపోథిస్. అంటే మనల్ని గమనిస్తున్నప్పటికీ.. మనతో సంబంధం పెట్టుకోవద్దని వారు నిర్ణయించుకుని ఉండవచ్చనే భావన.

భవిష్యత్తులో వారి మాటలు వినొచ్చా?   

Advertisement

రేడియో సిగ్నల్స్‌ తో పాటు ఆప్టికల్, లేజర్ సిగ్నల్స్, ఇతర టెక్నోసిగ్నేచర్స్ కోసం కూడా శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన టెలిస్కోపులు, అంతరిక్ష పరిశోధనలు, కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తే ఈ అన్వేషణ మరింత వేగం పుంజుకోవచ్చు. అయితే ఏలియన్స్‌ తో మనిషి ఎప్పుడు మాట్లాడతాడో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందన్నది మాత్రం ఈ విశ్వం దాచుకున్న అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Read Also: రాముడు, కృష్ణుడు నీలం రంగులో ఎందుకు కనిపిస్తారు? అసలు వర్ణం నలుపు కాదా?

Tags

Related News

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

Big Stories

Advertisement
×