Obesity triggers Kidney Cancer: ఊబకాయం అనేది ఇప్పడు సర్వ సాధారణం అయింది. డయాబెటిస్ నుంచి మొదలు పెడితే హార్ట్ ఎటాక్ వరకు ఎన్నో ప్రాణాంతకమైన జబ్బులు రావడానికి కూడా ఇదే కారణం అవుతోంది. ఇవి మాత్రమే కాకుండా అధిక బరువు కారణంగా కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊబకాయం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH)& అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్(AARP) ఇటీవల పరిశోధనలు చేసింది. ఇందులో భాగంగానే ఊబకాయం ఉన్న 204,364 మందిని పరిశీలించినట్లు పరిశోధనలు తెలిపారు. వీరిలో 1,425 కిడ్నీ క్యాన్సర్, లేదా కిడ్నీ సెల్స్‌కి సంబంధించిన క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందని చెబుతున్నారు.
దాదాపు 583 మందికి క్రిటికల్ రీనల్ సెల్ క్యాన్సర్, 339 మందికి ప్రాణాంతక RCC ఉందని గుర్తించామని AARP టీం తెలిపింది. మరికొందరిలో పాపిల్లరీ RCC వచ్చిందని, ఇంకొదరుక్రోమోఫోబ్ RCC, క్లియర్ సెల్ RCC వంటి వాటితో ఇబ్బంది పడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
ALSO READ: వెన్ను నొప్పి వేధిస్తోందా..?
ప్రతి ఒక్క పేషెంట్ కేసులో ఊబకాయం కామన్‌గా ఉందట. అయితే కొంతకాలం వరకు అధిక బరువు ఉండి క్రమంగా వెయిట్ లాస్ అయిన వారిలో ఈ ప్రభావం చాలా తక్కువగా ఉందట. దీర్ఘకాలికంగా అధిక బరువుతో ఇబ్బంది పడిన వారిలో మాత్రం ప్రాణాంతకమైన కిడ్నీ క్యాన్సర్లు వచ్చాయని అధ్యయానాలు చెబుతున్నాయి.
భవిష్యత్తులో ఈ రకమైన క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే బాడీ మాస్ ఇండెక్స్(BMI) కనీసం 10% కన్నా తక్కువగా ఉండేలా చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీలైనంత వరకు 18–35 సంవత్సరాల వయసులోనే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు.