Back Pain: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి. బరువు పెరగడం వల్ల వచ్చే నడుమునొప్పితో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య కారణంగా.. ఇంటి పనులు , ఆఫీసు పనులు సరిగ్గా చేసుకోలేకపోతుంటారు. ఇలాంటి సమయంలో డాక్టర్లు పెయిన్ రిలీఫ్ కోసం మందులు ఇచ్చినప్పటికీ.. పూర్తిగా సమస్య తొలగిపోదు.
మరి మీరు కూడా ఈ రకమైన నొప్పితో బాధపడుతుంటే.. నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని హోం రెమెడీస్ పాటించాలి. ఎలాంటి హోం రెమెడీస్ నడుము నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు, ఆవ నూనె:
మెంతులు నడుము నొప్పిని తగ్గించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. పూర్వం కూడా.. మన నానమ్మలు, అమ్మమ్మలు నొప్పి తగ్గడానికి ఆవ నూనెలో మెంతి గింజలను వేసి వాడేవారు. మీరు ఈ నూనెను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నూనె తయారు చేయడానికి.. 2 టీస్పూన్ల మెంతులను రుబ్బి పొడిలా చేయండి. ఇప్పుడు దానిని 2 నుండి 3 చెంచాల ఆవాల నూనెతో కలిపి వేడి చేయండి. నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి.. ఈ మిశ్రమంతో మీ నడుముపై మసాజ్ చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
వాము:
వాములో కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉంటాయి. అందుకే దీనిని నడుము నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం కాస్త వాము తీసుకుని పాన్ మీద కాస్త వేడి చేసి తర్వాత ఇక కాటన్ క్లాత్ లో చుట్టండి.దీనితో మీ నడుముపై రుద్దండి. ఇలా చేయడం వల్ల మీకు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
పసుపు, కలబంద జెల్ :
నడుమునొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు , కలబంద చాలా బాగా ఉపయోగపడతాయి. దీని కోసం.. మీరు ఒక చెంచా పసుపు పొడి , 2 చెంచాల కలబంద జెల్ తీసుకొని పేస్ట్ తయారు చేయాలి. దీన్ని నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది నొప్పి , వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద జెల్ నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.
ఉప్పు, వేడి నీరు:
ఉప్పు వాపును తగ్గించడానికి ,కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటే.. ఉప్పు, వేడి నీటితో కలిపిన కంప్రెస్ తీసుకోండి.
Also Read: ఇది వాడితే.. తల మోయలేనంత జుట్టు
కొబ్బరి నూనె, కర్పూరం:
కర్పూరం నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా నడుము వెన్నునొప్పితో బాధపడుతుంటే ఖచ్చితంగా కొబ్బరి నూనె, కర్పూరం కలిపి ఉపయోగించండి. ఈ రెండింటిని తగిన మోతాదులో తీసుకుని వేడి చేసి మీ నడుమును బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి త్వరగా తగ్గుతుంది.