E-Paper
Advertisement

New Halt Stations: సంక్రాంతి వేళ రైల్వే గుడ్ న్యూస్, ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆ స్టేషన్ లోనూ ఆగుతాయట!

New Halt Stations: సంక్రాంతి వేళ రైల్వే గుడ్ న్యూస్, ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆ స్టేషన్ లోనూ ఆగుతాయట!
Advertisement

Sankranti Festival New Halt Station: సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా సౌత్ సెంట్రల్ రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో క్రౌడ్ తగ్గించేందుకు జనవరి 7 నుంచి 20 వరకు సుమారు రెండు వారాల పాటు చర్లపల్లి స్టేషన్ లో 11 రైళ్లకు టెంపరరీ హాల్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద భారాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

హాల్టింగ్ ఎప్పటి నుంచి  ఉంటుందంటే..   

సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న టెంపరరీ హాల్టింగ్ నిర్ణయం జనవరి 7 మార్నింగ్ నుంచి జనవరి 20 ఈవినింగ్ వరకు అమల్లో ఉండనుంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతోంది.  సంక్రాంతి నేపథ్యంలో రోజువారీ రైళ్లతో పాటు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అదనపు రద్దీ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు చర్లపల్లి స్టేషన్ యూజ్ చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది.

Advertisement

Read Also: రైల్వే గుడ్ న్యూస్.. ఆ యాప్ లో టికెట్లు బుక్ చేస్తే 3% డిస్కౌంట్!

చర్లపల్లి రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ తీసుకునే  రైళ్లు

⦿ 12709- గూడూరు- సికింద్రాబాద్ సింహాపురి ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజూ పొద్దున్నే 4:29 నుంచి 4:30 వరకు ఆగుతుంది.

Advertisement

⦿ 12737- కాకినాడ- లింగంపల్లి గౌతమి ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజు పొద్దున్నే 4:09 నుంచి 4:10 వరకు ఆగుతుంది.

⦿12763- తిరుపతి- సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ ప్రెస్ ఉదయం 5:09 నుంచి 5:10 వరకు వారానికి 5 రోజుల పాటు ఆగుతుంది.

⦿12775- కాకినాడ టౌన్ – లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్  ఉదయం 5:59 నుంచి 6:00 గంటల వరకు వారానికి 3 రోజులు ఆగుతుంది.

⦿ 12739- విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీబ్‌ రథ్ ఎక్స్‌ ప్రెస్ ఉదయం 7:29 నుంచి 7:30 గంటల వరకు ప్రతి రోజూ ఆగుతుంది.

⦿ 17016- సికింద్రాబాద్ – భువనేశ్వర్ న్యూ విశాఖ ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజూ సాయంత్రం 5:09 నుంచి 5:10 వరకు ఆగుతుంది.

⦿ 12728- హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజూ సాయంత్రం 5:44  నుంచి 5:45 వరకు ఆగుతుంది.

⦿ 12776- లింగంపల్లి- కాకినాడ ఎక్స్‌ ప్రెస్ వారానికి మూడు రోజుల పాటు సాయంత్రం 7:55 నుంచి 7:56 వరకు ఆగుతుంది.

⦿ 12740- సికింద్రాబాద్- విశాఖపట్నం గరీబ్‌ రథ్ ఎక్స్‌ ప్రెస్  ప్రతి రోజు రాత్రి 8:45 నుంచి 8:46 వరకు ఆగుతుంది.

⦿ 12738- లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజు రాత్రి 9:29 నుంచి 9:30 వరకు ఆగుతుంది.

⦿ 12710- సికింద్రాబాద్ – గూడూరు సింహాపురి ఎక్స్‌ ప్రెస్ ప్రతి రోజూ రాత్రి 10:20 నుంచి 10:21 వరకు ఆగుతాయి.

Read Also: అయ్య బాబోయ్.. వందేభారత్ స్లీపర్ కోచ్ ధర అంత ఉంటుందా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×