BigTV English

Currency Notes in the Phone Cover: ఫోన్ కవర్ లో డబ్బులు పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Currency Notes in the Phone Cover: ఫోన్  కవర్ లో డబ్బులు పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Is It Dangerous To Keep Cash In Your Mobile Cover: మీరు అణుక్షణం యూజ్ చేసే సెల్ ఫోన్ సెక్యూరిటి కోసం పౌచ్ వేసుకుంటున్నారా? పోన్‌కు రక రకాలుగా రక్షణ ఇచ్చే ఆ ఫౌచ్ లో ఎలాంటి కాగితాలు కాని, కరెన్సీ నోట్లు కాని పెడితే పరమ డేంజర్ అంటున్నారు సెల్ ఫోన్ మెకానిక్‌లు. ఫోన్ పౌచ్ లో డబ్బులు పెట్టుకుంటే ప్రమాదం ఎలా అవుతుంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ వస్తువునైనా మర్చిపోవాల్సి ఉంటుంది. కాని సెల్ ఫోన్‌ లేకుండ బయటకు వెళ్లడం మాత్రం జరగనే జరగదు.


ఈ బాండింగ్ నేపథ్యంలో కొంతమంది అత్యవసరాల్లో ఉపయోగపడవచ్చు అన్న ఆలోచనలతో సెల్ ఫోన్ ప్యాచ్ కి మధ్య ఒక వందనోటో లేదంటే రెండువందల నోటో దాచిపెడుతూ ఉంటారు. మరికొంత మంది మంత్లీ బస్ పాస్ లు సెల్ ఫోన్ పౌచ్ లోపెట్టి కండెక్టర్ వచ్చినప్పుడు ఎంచక్కా చూపించేస్తుంటారు. కాని ఇదే డేంజర్ అంటున్నారు నిపుణులు. ఫోన్ కంటిన్యూగా వర్కింగ్ లో ఉన్నప్పుడు.. బయట ఎండసెగ బాగా ఉన్నప్పుడు ఫోన్ వేడెక్కుతుంది. సెల్ ఫోన్ వెనుక పౌచ్‌లో కరెన్సీ నోట్‌లు, లేదంటే బస్ పాస్ లు, ఏటీఎమ్ కార్డులాంటివి ఉన్నప్పుడు ఆ వేడి బయటకు పోయే పరిస్థితి ఉండదు.

Also Read: రాత్రి నిద్ర పట్టట్లేదా.. అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేస్తున్నారా.. ఈ చిట్కాలు మీ కోసమే


ఇలాంటి పరిస్తితుల్లో ఫోన్ బాగా వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా పౌచ్ లో కాగితాలు పెట్టడం వల్ల వైర్లెస్ ఛార్జింగ్ విషయంలో కూడా కాస్తంత ఇబ్బందుల ఎదురవుతాయి. ఇక ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి మాట్లాడటం చాలా డేంజర్ అనేది అనేక సెల్ ఫోన్ ప్రమాదాల్లో బయటపడింది. సో .. కీడెంచి మేలించాలన్నా పెద్దల మాట ప్రకారం సెల్ ఫోన్ పౌచ్ లో కరెన్సీ నోట్లు బస్ పాస్ లాంటివి పెట్టకపోవడమే చాలా బెటర్.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×