Vaping: e-సిగరెట్లు, వేప్‌లు ఉపయోగించి నికోటిన్‌ను పీల్చుకోవడాన్ని వేపింగ్ అంటారు. ఇవి బ్యాటరీతో పని చేస్తాయట. చాలా మందికి వీటిని వాడే అలవాటు ఉంటుంది. సిగరెట్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ వేప్స్ అనేవి అంతకు మించిన ప్రమాదాన్ని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వేప్‌లు వాడే వారిలో చాలా మందికి లంగ్స్‌కి సంబంధించిన సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.
వేపింగ్ వల్ల హాని..
ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వేపింగ్, ధూమపానం కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధికంగా వేప్స్ వినియోగించే వారిలో బ్రాంకటిస్ వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అంతేకాకుండా వేపింగ్ వాడడం, సిగరెట్స్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గుండెకు రక్తా్న్ని తీసుకెళ్లే ధమనుల పనితీరుపై వేప్స్ చెడు ప్రభావం చూపే అవకాశం ఉందట.
ALSO READ: సమ్మర్ డైట్‌లో బెస్ట్ ఫుడ్
వేపింగ్ వల్ల పెద్ద పేగు, రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. e-సిగరెట్లలో ఉండే ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, నైట్రోసమైన్‌ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
శరీరంలోని లిపిడ్‌లు, గ్లూకోజ్‌పై కూడా వేపింగ్ వల్ల చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేపింగ్ చేసిన వారిలో చాలా మందికి శరీరంలో ఎక్కువ మొత్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
స్మోకింగ్ చేసేవారిలో రక్తప్రసరణ కొంత వరకు పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టిందని ఓ అధ్యయనంలో తేలింది. కానీ, వేప్స్ వాడే వారిలో చాలా మందికి లోబీపీ సమస్యలు వచ్చాయట.
ఏది సేఫ్..?
సిగరెట్లు తాగడంతో పోలిస్తే వేపింగ్ వల్ల చాలా తక్కువ హాని జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే కొంతైనా దీని వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేపింగ్ కూడా ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోవాలని అంటున్నారు.
సిగరెట్స్ అయినా వేపింగ్ అయినా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది. వీటికి బానిసలుగా మారితే చేతులారా నిండు జీవితాన్ని నాశనం చేసుకన్నట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.