BigTV English

Bobby : చిరు-బాలయ్య కాదు, బాలీవుడ్ స్టార్ హీరోతో బాబీ.. ఎన్టీఆర్ హ్యాండ్ ఉందా?

Bobby : చిరు-బాలయ్య కాదు, బాలీవుడ్ స్టార్ హీరోతో బాబీ.. ఎన్టీఆర్ హ్యాండ్ ఉందా?

Bobby : టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి టాలీవుడ్ స్టార్ హీరోలతో కాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ జోష్‌లో ఉన్న బాబీ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహంతో సినిమాలు చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ వెనక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఏమైనా ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది.


పవర్‌తో మెగాఫోన్

రచయితగా సినీ కెరీర్ ఆరంభించిని బాబీ కొల్లి.. మాస్ మహారాజా ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. రవితేజ రెండు పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ కామెడీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు బాబీ. పవన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ‘గబ్బర్ సింగ్’కి సీక్వెల్‌గా రూపొందింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఈ సినిమాతో పవర్ స్టార్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిపోగా.. బాబీ కెరీర్‌ను డీలా పడేలా చేసింది. కానీ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన ‘జై లవ కుశ’తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు బాబీ. జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా బాబీకి భారీ విజయాన్ని అందించింది. ఇక జై లవ కుశ తర్వాత సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు బాబీ.


సీనియర్స్‌ ఇద్దరికి సూపర్ హిట్స్

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌, యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యల కాంబినేషన్లో ‘వెంకీమామ’ అనే సినిమా చేశాడు బాబీ. కానీ ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఏర్గా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, బాబీకి మరో బ్లాక్‌బస్టర్‌ను అందించింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య ‘డాకు మహారాజ్‌తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా డాకు మహారాజ్ నిలిచింది. దీంతో.. బాబీ నెక్స్ట్ సినిమా ఏంటనే చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ హీరోతో ఫిక్సా?

డాకు మహారాజ్ తర్వాత మరోసారి బాబీ, చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో సినిమా చేయబోతున్నాడట బాబీ. రీసెంట్‌గానే ముంబై వెళ్లి హృతిక్ రోషన్‌కు స్టోరీ లైన్ కూడా చెప్పాడట. హృతిక్ కూడా కథ బాగా నచ్చి.. ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్టు అయిన తర్వాత మరోసారి హృతిక్ ఫుల్ స్టోరీ నరేట్ చేయబోతున్నాడట. అప్పుడు హృతిక్ సై అంటే.. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టేనని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ వెనక ఎన్టీఆర్ ఉన్నాడా? అనే సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం హృతిక్‌తో వార్ 2 సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. కాబట్టి.. ఎన్టీఆర్ హ్యాండ్ లేకుండా హృతిక్‌ని బాబీ కలవలేదని గ్యారెంటిగా చెప్పలేం. కానీ ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×