BigTV English

Akhil: కాబోయే భార్యతో స్పెషల్‌గా ప్లాన్ చేసిన అఖిల్!

Akhil: కాబోయే భార్యతో స్పెషల్‌గా ప్లాన్ చేసిన అఖిల్!

Akhil : అఖిల్ అక్కినేని ఒక సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా కాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. చివరగా ఏజెంట్ సినిమాతో చేసిన మాస్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. దీంతో.. అప్ కమింగ్ ప్రాజెక్ట్‌తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఆరవ చిత్రం అధికారిక ప్రకటన రాబోతోంది. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో.. అక్కినేని అభిమానులు ఈ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ అఖిల్ మాత్రం కాబోయే భార్యతో చాలా స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆమెతో కలిసి ఫారిన్ ఫ్లైట్ కూడా ఎక్కేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


జైనాబ్‌తో విదేశాలకు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీ (Zainab Ravdjee)ని పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. జైనాబ్ రావ్డ్జీ ఒక ప్రముఖ ఆర్టిస్ట్ మరియు డిజైనర్, ఆమె దుబాయ్‌కు చెందిన పారిశ్రామికవేత్త జుబేర్ రావ్డ్జీ కుమార్తె. గతేడాది చివర్లో హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో సన్నిహితంగా నిర్వహించబడింది. నాగార్జున (Nagarjuna) ఈ సంతోషకరమైన సంఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఆయన తన పోస్ట్‌లో, “మా కుమారుడు అఖిల్ జైనాబ్‌తో నిశ్చితార్థం జరిగినందుకు సంతోషంగా ఉంది. జైనాబ్‌ను మా కుటుంబంలో కోడలిగా స్వాగతిస్తున్నాము. ఈ కొత్త జంటకు మీ ఆశీర్వాదాలు కావాలి” అని పేర్కొన్నారు. త్వరలోనే అఖిల్, జైనాబ్ పెళ్లి పీఠలెక్కబోతున్నారు. అయితే.. ఈలోపు ఈ కొత్త జంట విదేశీ టూర్లకు వెళ్తు కెమెరా కంట పడుతున్నారు. తాజాగా అఖిల్ బర్త్ డే సెల్రబేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు అఖిల్, జైనాబ్. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అఖిల్, జైనాబ్ కలిసి జంటగా కనిపించారు. ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రేపే అఖిల్ బర్త్ డే ఉంది. దీంతో కాబోయే భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు అఖిల్ విదేశాలకు వెళ్లినట్టుగా టాక్.


బర్త్ డే స్పెషల్.. అఖిల్ 6

అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ అఖిల్ 6 (Akhil 6) అప్టేట్ ఇచ్చేశాడు. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ నెల 8న ఈ సినిమాను అధికారకంగా ప్రకటించనున్నారు. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా.. Akhil 6 టైటిల్ గ్లింప్స్ రివిల్ చేస్తున్నట్లుగా ప్రీ లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు. ప్రీ లుక్‌లో అఖిల్ లాంగ్ హెయిర్‌, గుబురు గడ్డంతో రగ్గ్‌డ్ లుక్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరగుతోంది. రాయల సీమ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని.. అఖిల్‌ ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టబోతున్నట్టుగా సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. హిట్ జోష్‌లో ఉన్న నిర్మాత నాగవంశీ తమ హీరోరి సూపర్ హిట్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని అభిమానులు. అఖిల్ కూడా ఈ ప్రాజెక్ట్ పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈసారి అఖిల్ ఏం చేస్తాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×