BigTV English
Advertisement

Steel Utensils: స్టీలు పాత్రలు వాడడం మంచిదే.. కానీ ఈ ఐదు రకాల ఆహారాలను వాటిలో ఉంచకూడదు

Steel Utensils: స్టీలు పాత్రలు వాడడం మంచిదే.. కానీ ఈ ఐదు రకాల ఆహారాలను వాటిలో ఉంచకూడదు

అల్యూమినియం పాత్రలో నాన్ స్టిక్ కుక్కువేర్, ఇనుము పాత్రలతో పోలిస్తే స్టీలు పాత్రలు ఎంతో మంచివి. అంతే కాదు వీటి మన్నిక కూడా ఎక్కువ. వీటిని శుభ్రం చేసుకోవడం కూడా సులువు. అందుకే మనం అధికంగా వాడే వాటిలో స్టీల్ పాత్రలే ఎక్కువగా ఉంటాయి. అయితే స్టీలు పాత్రలు మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. అది నిజమే అయినా… కొన్ని రకాల ఆహారాలను మాత్రం స్టీల్ గిన్నెలో వేయకూడదు. ఆహారాలలో పోషక విలువలను ప్రభావితం చేసే శక్తి స్టీలుకి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను స్టీల్ పాత్రలో వేయకూడదో తెలుసుకోండి.


పెరుగు
పెరుగుకు సహజంగానే ఆమ్ల స్వభావం ఉంటుంది. దీన్ని స్టీలు పాత్రలో ఎక్కువ సేపు నిలువ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల పెరుగుకు లోహపురుచి వచ్చేస్తుంది. స్టీలు పాత్రలో పెరుగును వేయడం వల్ల కిణ్వ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. దాని ఆకృతి కూడా మారిపోతుంది. పెరుగును తాజాగా ఉంచాలంటే గాజు పాత్రలో వేయడం మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్ ప్రయోజనాలను కూడా గాజు పాత్ర కాపాడుతుంది. గాజుపాత్రలో నిల్వ ఉంచిన పెరుగును తింటే పేగు ఆరోగ్యము, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

నిమ్మకాయ
నిమ్మకాయతో చేసిన పులిహోర, నిమ్మకాయ రసం, నిమ్మ నీళ్లు వంటివి స్టీల్ బాక్స్ లో వేయకూడదు. వాటిని స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే అందులోని పుల్లదనం చాలా వరకు పోతుంది. ఆమ్ల ఆహారాలు స్టీలులోని లోహంతో చర్య జరిపి ఆ రుచిని పాడు చేస్తాయి. నిమ్మ అసలు రుచిని కాపాడాలంటే వాటిని గాజు పాత్రలో వేసుకుని తింటేనే మంచిది.


ఊరగాయలు
తెలుగు వారికి ఊరగాయలు, ఆవకాయలు వంటి నిల్వ పచ్చడి అంటే ఎంతో ఇష్టం. ఇందులో చింతపండు, ఉప్పు, నూనె, నిమ్మకాయ వంటివి వాడుతూ ఉంటారు. వాటిని స్టీలు పాత్రలో వేయడం వల్ల అందులో ఉండే ఆమ్లాలు ఉక్కుతో చర్య జరపడం ప్రారంభిస్తాయి. ఈ ప్రతిచర్య రుచిని మార్చేస్తుంది. అలాగే వాటి నిల్వ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అవి త్వరగా పాడయ్యేలా చేస్తుంది. ఊరగాయల రుచి నాణ్యతను కాపాడుకోవాలంటే గాజు పాత్రలోనే వేయడం మంచిది.

పండ్లు, ఫ్రూట్ సలాడ్లు
స్టీలు కంటైనర్లలో పండ్లను ముక్కలుగా చేసి వేయకూడదు లేదా ఫ్రూట్ సలాడ్లు వంటివి కూడా వేయకూడదు. పండ్లలోని రసాయనాలు లోహంతో తేలికపాటి ప్రతిచర్యలు జరుగుతాయి. దీనివల్ల అవి మరింత మెత్తగా అయిపోతాయి. వాటి సహజమైన రుచిని కోల్పోతాయి. కాబట్టి పండ్లను ముక్కలుగా వేసి నిల్వ చేసేందుకు గాజు పాత్రలే మంచిది. పైన మూత పెట్టి గాజు పాత్రలో పండ్ల ముక్కలను వేస్తే అవి తాజాగా ఉంటాయి.

టమోటో వంటకాలు
టమోటాలు వేసిన ఏ కూరను కూడా స్టీల్ పాత్రలో వేయకపోతేనే ఉత్తమం. ఎందుకంటే టమోటాల్లో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఆమ్లాలు ఉక్కుతో చర్య జరిపి ఆ కూరలోని పోషకాలను రుచిని దెబ్బతీస్తాయి. కాబట్టి టమోటోలు అధికంగా వేసిన ఆహారాలను స్టీలు పాత్రలో నిల్వ చేయకండి.

Related News

Eggs: డైలీ ఎగ్ తింటే మతిపోయే లాభాలు.. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మరి !

Iron Deficiency: మహిళల్లో ఐరన్ లోపం.. అసలు కారణాలేంటో తెలుసా ?

Gas Burner Cleaning Hacks: గ్యాస్ బర్నర్‌లు జిడ్డుగా మారాయా ? ఈ టిప్స్‌ పాటిస్తే.. కొత్త వాటిలా మెరుస్తాయ్

Underwear: అండర్‌ వేర్ ఉతక్కుండా ఎన్ని రోజులు వాడొచ్చు?

Wrinkles​: ముఖంపై ముడతలా ? ఇవి తింటే.. నిత్య యవ్వనం

Dark Circles: డార్క్ సర్కిల్స్ సమస్యా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Mustard oil For Hair: ఆవ నూనెతో అద్భుతం.. ఇలా వాడితే తల మోయలేనంత జుట్టు

Jeera Water: రాత్రి పూట జీలకర్ర నీరు తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్

Big Stories

×