BigTV English

Vitamin Deficiency: నడుస్తున్నప్పుడు హఠాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే

Vitamin Deficiency: నడుస్తున్నప్పుడు హఠాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే

కొంతమంది ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది కూడా కొన్ని సెకన్ల పాటూ అనిపించిన తర్వాత సాధారణ స్థితికి వచ్చేస్తారు. అందుకే ఎంతోమంది ఆ విషయాన్ని పట్టించుకోరు. నడుస్తున్నప్పుడు మీకు హఠాత్తుగా ఇలా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే అది ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయమే. దానికి తగిన చికిత్సను తీసుకోవాలి.


విటమిన్ ఇ ఎందుకు?
మన శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండాలి. అంటే మనకి ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు కావాలి. అలాంటి విటమిన్లలో విటమిన్ ఈ ఒకటి. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే శక్తి దీనికి ఉంటుంది. అలాగే వృద్ధాప్యం త్వరగా రాకుండా ఇన్ఫ్లమేషన్ వంటివి రావు. శరీరంలో ఏర్పడకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఇది ముందుంటుంది. అయితే ఈ విటమిన్ శరీరం లోపిస్తే మీకు హఠాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు విటమిన్ ఈ అధికంగా ఉండే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది. కేవలం ఇదొక్క లక్షణమే కాదు. విటమిన్ ఈ లోపాన్ని మరికొన్ని లక్షణాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

మీలో చురుకుదనం క్రమంగా తగ్గుతున్నా అది విటమిన్ ఈ లోపం వల్ల అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విటమిన్ ఈ లోపం వల్ల కనిపించే లక్షణాలు మొదట్లో సూక్ష్మంగానే ఉంటాయి. ఆ లోపం తీవ్రమైతే అప్పుడు సంకేతాలు కూడా బలంగా కనిపిస్తాయి.


నాడీ సంబంధిత సమస్యలు
విటమిన్ ఈ లోపం వల్ల అటాక్సియా అనే సమస్య వస్తుంది. ఇది స్పష్టమైన నాడీ సంబంధిత సమస్య. దీనివల్ల ఏదీ సరిగా అర్థం కాదు. నడక కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తడబడుతున్నట్టు నడుస్తారు. ఎందుకంటే విటమిన్ ఇ అనేది నాడీ వ్యవస్థ, శరీర అవయవాల మధ్య సమన్వయాన్ని నిర్వహించడానికి ముఖ్యమైనది. విటమిన్ ఇ లోపం ఈ సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల అవయవాలు పనిచేయడంలో ఇబ్బంది మొదలవుతుంది.

విటమిన్ ఇ లోపం ఉన్న వారిలో అధికంగా కనిపించేది తిమ్మిరి. చేతులు కాళ్లల్లో విపరీతంగా తిమ్మిర్లు కనిపిస్తాయి. విటమిన్ ఇ లోపం వల్ల నాడీ కణాలలో ఆక్సీకరణ నష్టం పెరిగిపోతుంది. దీనివల్ల ఆ నరాలు, నరాలను ఇన్సులేట్ చేసే మైలిన్ కాలక్రమంగా క్షీణిస్తుంది. అంటే సంకేతాలను పంపే నరాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల చేతిలో కాలంలో తిమ్మిరి అధికమైపోతుంది.

విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది. ఇది మన దృష్టిలోపాలను సరిచేస్తుంది. రెటీనాలోని ఫోటో రిసెప్టర్ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. శరీరంలో ఎప్పుడైతే విటమిన్ ఇ స్థాయిలు తగ్గుతాయో… రెటినాలోని ఫోటో రిసెప్టర్ కణాలు క్షీణించడం ప్రారంభమవుతాయి. దీనివల్ల దృష్టి మసకబారడం, తక్కువ కాంతిలో చూడలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. రే చీకటి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దృష్టి సమస్యలు రాకుండా విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి.

Related News

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Big Stories

×