BigTV English

Techie Expenses: ఏడాదికి 40 లక్షల జీతం.. కానీ ప్రతినెలా డబ్బు కొరతే అంటున్న టెకీ, అతని ఖర్చుల జాబితా ఇదిగో

Techie Expenses: ఏడాదికి 40 లక్షల జీతం.. కానీ ప్రతినెలా డబ్బు కొరతే అంటున్న టెకీ, అతని ఖర్చుల జాబితా ఇదిగో

సంవత్సరానికి 40 లక్షల రూపాయల జీతం అనగానే వారి జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాత్రం ఆ జీతం తనకు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రతినెలా అప్పులు చేయాల్సి వస్తోందని, డబ్బు కొరతతో ఎంతో ఇబ్బంది పడుతున్నానని చెబుతున్నాడు. ఆ వ్యక్తికి కోటిన్నర విలువైన ఫ్లాట్, కొత్త కారు, పెద్ద కంపెనీలో ఉద్యోగం ఉంది. బయటకి చూస్తే పరిపూర్ణంగా విజయం సాధించినట్టే కనిపిస్తున్నాడు. కానీ ప్రతి నెల డబ్బుకు తాను ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నాడు. ఆ 32 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ ఇలా ఎందుకు ఎందుకు ఇబ్బందిపడుతున్నాడో తెలుసుకోండి.


చార్టెడ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ ఆ ఐటీ ఉద్యోగి ఆర్థిక పరిస్థితిని విశ్లేషించాడు. అతను అంత సంపాదిస్తున్నా కూడా ప్రతి నెలా డబ్బు కొరతతో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో, ఆర్థిక స్వేచ్ఛకు ఎందుకు దూరం అవుతున్నాడో అందరికీ అర్థమయ్యేలా వివరించాడు.

అతని ఖర్చులు ఇవే
నితీష్ చెప్పిన ప్రకారం ఏడాదికి 40 లక్షల రూపాయల జీతం వస్తుంది. అన్ని కటింగ్స్ పోనూ ప్రతినెలా చేతికి రెండు లక్షల 20వేల రూపాయలు వస్తుంది. అతను ముంబైలోని ఒక ప్రాంతంలో ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు. దాని ధర కోటిన్నర రూపాయలు. ఈ కోటిన్నరలో అతను కేవలం పాతిక లక్షలు మాత్రమే చెల్లించి… మిగతా కోటి పాతిక లక్షలు బ్యాంకు లోన్ వాడాడు. ఆ కోటి పాతిక లక్షల రూపాయలకు నెలకు రూ. 1,12,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు.


నెల చివరికి మిగిలేది ఇదే
దీన్నిబట్టి జీవితంలో సగానికి సగం ఈఎమ్ఐలకే పోతోంది. ఇక ఇంటి ఖర్చు, ఆస్తి పన్నులు వంటివన్నీ అదనపు ఖర్చులు. అలాగే ఒక కారును తీసుకున్నాడు. దానికి నెలకు రూ. 15,000 ఈఎంఐ కడుతున్నాడు. ఇంకా ఆహారం, కరెంటు బిల్లులు, పెట్రోల్, సినిమాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి 50 వేల రూపాయల వరకు నెలకు అవుతున్నాయి. అయితే ఈ ఖర్చులన్నీ తీసేస్తే చివరికి వచ్చేసరికి ఆయన చేతిలో 30 వేల నుంచి 40 వేల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి. ఇక ఏదైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే ఆ 30000 నుంచి 40 వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే ముంబైలో ఆసుపత్రుల ఖర్చులు కూడా అధికం.

ఇక ఉద్యోగం ఉంటే ప్రతినెలా ఇలా ఇంటి నిర్వహణను ఈడ్చుకు రావచ్చు. లే ఆఫ్ వంటి ప్రమాదాలు వస్తే అతడి జీవితము, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుంది.

ఆస్తిలో ధనవంతుడిగా కనిపిస్తున్నా.. నెల చివరికి వచ్చేసరికి మాత్రం డబ్బు లేని వాడిగా మారిపోతున్నాడు ఈ టెకీ. అతని వద్ద ఆస్తులు ఉన్నాయి కానీ చేతిలో డబ్బు మాత్రం మిగలడం లేదు. పొదుపు చేయడం లేదు. పదవీ విరమణ చేసిన తర్వాత ఎలా జీవించాలన్న దానిపై ప్రణాళిక కూడా లేదు.

ఆదాయంలో సగం పొదుపు చేయాలి
ఎక్కువ జీతం వస్తున్నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నాడు. ఇలాంటి టెకీలే జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంటున్నారు. ఆదాయంలో సగం పొదుపు చేస్తేనే వారి జీవితం ఆనందంగా ఉంటుంది. మిగతా సగం లోని ఇంటి ఖర్చులను, ఈఎమ్ఐలకు వచ్చేలా చూసుకోవాలి. అత్యవసరం నిధి కూడా పెట్టుకోవడం చాలా ముఖ్యం.

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా కలిసి రావచ్చు. అధిక జీతం సంపాదిస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారంటే మీరు ఆర్థిక ప్రణాళికను సరిగా వేసుకోవడం లేదని అర్థం. కాబట్టి పైన చెప్పిన టెకీలా కాకుండా ఖర్చులను అదుపులో ఉంచుకొని అనవసరమైన లగ్జరీ లైఫ్ ను వదిలిపెట్టుకోవాలి. రేపటి కోసం ఈ రోజే ఎంతోకొంత పొదుపు చేయడం ప్రారంభించాలి.

Related News

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Big Stories

×