E-Paper
Advertisement

క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు

క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు
Advertisement

Numerology| పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు నిజం చెబుతున్నారా? లేక తల్లిదండ్రులకు తెలియకుండా విషయాలను దాచిపెడుతున్నారా? అనే సందేహం చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. కొంతమంది పిల్లలు తమ తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు చిన్న విషయాలకే సాకులు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే న్యూమరాలజీ ప్రకారం.. పిల్లల పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వంపై కొంత ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 3 మూలాంకాలకు చెందిన పిల్లలు తమ తెలివితేటలతో విషయాలను దాచగలరని, అబద్ధాలు చెప్పగలరు. మరి ఏ తేదీల్లో పుట్టిన పిల్లలకు ఈ మూలాంకాలు వస్తాయో తెలుసుకుందాం.

మూలాంకం 1.. నాయకత్వ లక్షణాలు కలిగిన పిల్లలు

మూలాంకం 1 ఉన్న పిల్లలు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. వీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎక్కడైనా తమ మాటకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు.
కొన్నిసార్లు తల్లిదండ్రుల ముందు కూడా తమ తప్పులను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. తమ అభిప్రాయమే సరైనదని నిరూపించుకోవడానికి అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా తమ బలహీనతలు బయటపడకూడదని ప్రయత్నంలో ఇలా చేస్తారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు తప్పులు అంగీకరించడం నేర్పించాలి. నిజాయితీగా మాట్లాడినప్పుడు వారిని ప్రోత్సహించాలి. ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 1 అవుతుంది.

మూలాంకం 3.. స్వేచ్ఛను ఇష్టపడే చురుకైన పిల్లలు

Advertisement

మూలాంకం 3 కలిగిన పిల్లలు చలాకీగా, ఉత్సాహంగా ఉంటారని న్యూమరాలజీ వివరిస్తోంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు తమ తప్పులను తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెడతారు. శిక్ష పడుతుందనే భయం లేదా ఆంక్షలు విధిస్తారనే ఆందోళనతో నిజాన్ని దాచవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. వారి సమస్యలను ఓపికగా వినాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా షేర్ చేసుకుంటారు.
ఏ నెలలోనైనా 3, 12, 21 తేదీల్లో పుట్టిన పిల్లల మూలాంకం 3 అవుతుంది.

Also Read: పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మూలాంకం 5.. మాటలతో ఆకట్టుకునే తెలివైన పిల్లలు

Advertisement

ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 5 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం.. మూలాంకం 5 ఉన్న పిల్లలు తెలివిగా, చురుకుగా మాట్లాడతారు. తమ అభిప్రాయాలను ఇతరులకు నచ్చేలా చెప్పగలుగుతారు. కొన్నిసార్లు తప్పుల నుంచి తప్పించుకోవడానికి కొత్త కథలు అల్లేస్తారు. తమ మాటలతో తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా వివరించే నేర్పు ఉంటుందని భావిస్తారు. అయితే తల్లిదండ్రులు పిల్లలను ముందుగానే అనుమానించకూడదు. నిజం చెప్పినప్పుడు వారిని అభినందించాలి. అబద్ధాలు చెప్పకుండా ఉండేలా ప్రేమతో మార్గనిర్దేశం చేయాలి.

Also Read: చాణక్య నీతి.. ప్రేమ కోసం ఈ 6 విషయాలను వదులుకుంటే చివరకు బాధపడేది మీరే

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లల ప్రవర్తనను వారి పుట్టిన తేదీల ఆధారంగా నిర్ణయించకూడదు. న్యూమరాలజీకి సంబంధించిన ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. పిల్లల పెంపకం, కుటుంబ వాతావరణం, అనుభవాలు వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. పిల్లలు తప్పు చేసినప్పుడు అతిగా కోప్పడకుండా ప్రేమగా మాట్లాడాలి. నిజాయితీగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి. అప్పుడే పిల్లలు భయం లేకుండా నిజం చెప్పడం నేర్చుకుంటారు.

Related News

రామాయణంలో జటాయువు గోళ్లు రావణుడు ఎందుకు తీసుకున్నాడు? ఇదే అసలు కారణం

పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఏఐని ప్రయోగించిన తండ్రి.. సూపర్ ఐడియా

చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. పంజా విసరగానే అమాయకుడు బలి

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయిపోయిందా? కొత్తది కొనాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే సరి

కరివేపాకు పన్నీర్ ఫ్రై..ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

బాలల దినోత్సవం స్పెషల్.. పిల్లల ముఖంలో నవ్వులు చూసేందుకు 7 టిప్స్

Big Stories

Advertisement
×