E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!
Advertisement

Increase Phone Speed: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు దాని స్పీడ్ చూస్తే భలే మురిసిపోతుంటాం. ఏ యాప్ ఓపెన్ చేయాలన్నా క్షణాల్లో తెరుచుకుంటుంది. భారీ గేమ్స్ ఆడినా, ఒకేసారి నాలుగైదు యాప్స్ వాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అదే ఫోన్‌ను మూడేళ్లు, నాలుగేళ్లు వాడేసరికి పరిస్థితి మారిపోతుంది. చిన్న యాప్ ఓపెన్ చేయాలన్నా సమయం పడుతుంది. ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుంది. కొన్నిసార్లు ఏ పని చేయకపోయినా వేడెక్కుతుంది. దీంతో చాలామంది ఫోన్ పాతదైపోయిందని భావించి కొత్తది కొనాలని నిర్ణయించుకుంటారు. కానీ అంత తొందర ఎందుకు? ఫోన్ స్లో అవడానికి కొన్ని చిన్న చిన్న కారణాలు ఉంటాయి. వాటిని గుర్తించి కొన్ని సెట్టింగ్స్ మార్చడంతో పాటు, అవసరం లేని ఫైళ్లను తొలగిస్తే మీ పాత ఫోన్ పనితీరును చాలావరకు మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ యాప్‌ల భారం:

కాలం మారుతున్న కొద్దీ యాప్స్‌లో కొత్త ఫీచర్లు, గ్రాఫిక్స్, సెక్యూరిటీ మార్పులు పెరుగుతున్నాయి. వీటిని తట్టుకోవడానికి ఎక్కువ ర్యామ్, ప్రాసెసర్ శక్తి కావాలి. కొత్త ఫోన్లు వీటిని సులువుగా తట్టుకున్నా, పాత ఫోన్లు కాస్త ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా భారీ గేమ్స్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా యాప్స్ నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. అందుకే మీకు అవసరం లేని యాప్స్ తీసేయడం ఉత్తమం. వాడని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వకుండా కూడా ఆపేయాలి.

స్టోరేజ్, బ్యాటరీ చెకప్:

Advertisement

మనం తీసుకునే ఫొటోలు, వీడియోలు, వాట్సప్ ఫార్వర్డ్స్ వల్ల ఫోన్ మెమరీ నిండిపోతుంది. ఖాళీ స్థలం తగ్గితే ఫోన్ వేగంగా పనిచేయలేదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డూప్లికేట్ ఫొటోలు, అవసరం లేని వీడియోలు, వాట్సప్, టెలిగ్రామ్‌లోని పెద్ద ఫైళ్లను డిలీట్ చేయండి. మరోవైపు, పాత బ్యాటరీ వల్ల ఛార్జింగ్ త్వరగా దిగిపోవడమే కాకుండా.. ఫోన్ స్పీడ్ కూడా తగ్గుతుంది. బ్యాటరీ హెల్త్ మరీ దెబ్బతింటే, కొత్త బ్యాటరీ వేయించుకోవడం చాలా ఉత్తమం.

Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

వేడి తగ్గించి రీస్టార్ట్ చేయడం:

Advertisement

గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు తీసేటప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంది. లోపలి భాగాలు పాడవకుండా ఉండేందుకు ఫోన్ తన వేగాన్ని తనే తగ్గించుకుంటుంది. అందుకే ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడకూడదు. ఫోన్ వేడెక్కితే కాసేపు పక్కన పెట్టేయాలి. మందపాటి కవర్ ఉంటే తీసేయడం ఇంకా మంచిది. అలాగే వారానికోసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల చిన్నచిన్న సమస్యలు తొలగిపోయి ఫోన్ ఫ్రెష్‌గా పనిచేస్తుంది.

సాఫ్ట్‌వేర్ జాగ్రత్తలు:

ఫోన్‌కు వచ్చే అధికారిక అప్‌డేట్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్పీడ్ పెంచుతామని చెప్పే నకిలీ క్లీనర్ యాప్స్ జోలికి అస్సలు వెళ్లకండి. సెట్టింగ్స్‌లో అవసరం లేని యానిమేషన్లు తగ్గించడం, ఫోన్ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మొదలయ్యే యాప్స్‌ను ఆపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చేసినా ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుంటే ఒకసారి సర్వీస్ సెంటర్‌లో చూపించండి. చిన్న రిపేర్‌తో సమస్య తీరిపోతే.. కొత్త ఫోన్ కొనే డబ్బులు మీకు మిగిలినట్లే కదా.

Also Read: రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

Tags

Related News

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

ఫ్రై,బేక్,గ్రిల్ అన్నీ ఒక్క చోటే!రూ.2,599కే ఎయిర్ ఫ్రైయర్

Big Stories

Advertisement
×