E-Paper
Advertisement

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. పంజా విసరగానే అమాయకుడు బలి

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. పంజా విసరగానే అమాయకుడు బలి
Advertisement

Tiktok Tiger Mauls Teenager| సోషల్ మీడియాలో చాలామంది తమ వీడియోలు త్వరగా వైరల్ కావాలనే విచిత్ర దృశ్యాలు చిత్రీకరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొద్దిసేపు గుర్తింపు కోసం చేసే ప్రమాదకరమైన స్టంట్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. వీడియోలో కొత్తదనం చూపించాలనే ప్రయత్నం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. టిక్‌టాక్ వీడియో షూటింగ్ కోసం బోనులో నుంచి బయటకు తీసుకొచ్చిన పులి ఒక యువకుడిపై దాడి చేసింది. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్ సమీపంలో జరిగింది.

టిక్‌టాక్ వీడియో షూటింగ్‌లో దాడి చేసిన పులి

మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ కథనం ప్రకారం.. పాకిస్థాన్‌లోని లాహోర్ సమీపంలోని కహ్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో పులుల పెంపక కేంద్రం ఉంది. కంటెంట్ క్రియేటర్ నౌమన్ హసన్ టిక్‌టాక్ వీడియో కోసం పులిపిల్లని తీసుకురావాలని కోరినట్లు సమాచారం.
దీంతో ఫామ్‌హౌస్ సిబ్బంది బోనులో ఉన్న ఆడపులిని బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న 19 ఏళ్ల తల్హాపై అది ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్హాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ అతడిని కాపాడలేకపోయారు. తాల్హా మరణంతో ఈ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు ఫామ్‌హౌస్ యజమాని అరెస్ట్

Advertisement

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ నౌమన్ హసన్, ఫామ్‌హౌస్ యజమాని ఫయ్యాజ్‌ను అరెస్ట్ చేశారు. యువకుడి గాయాలకు మొదట కుక్క దాడే కారణమని హసన్ అబద్దం చెప్పినట్లు సమాచారం. అయితే, విచారణలో ఆడపులి దాడి వల్లే అతడికి ప్రాణాంతక గాయాలైనట్లు వెల్లడైంది.
దీంతో అసలు విషయాన్ని దాచేందుకు ప్రయత్నించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో పులిని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? భద్రతా నిబంధనలు పాటించారా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

ప్రమాదకరమైన సోషల్ మీడియా స్టంట్లపై పోలీసుల హెచ్చరిక

ఈ ఘటనపై లాహోర్ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, పాపులారిటీ కోసం మనుషుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం సరికాదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Also Read: బ్రేకప్ తర్వాత మళ్లీ డేటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? మళ్లీ ప్రేమలో పడే ముందు ఈ విషయాలు ఆలోచించండి

గతంలోనూ క్రూరమృగాలతో వీడియోలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్

నౌమన్ హసన్ గతంలోనూ పులులు, చిరుతపులులతో వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న కొన్ని వీడియోల్లో ప్రమాదకరమైన స్టంట్లు కనిపిస్తున్నాయి. ఓ వీడియోలో గొలుసుతో కట్టేసిన పులిని దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. మరో వీడియోలో చిరుతపులిని నిమురుతుండగా అది ఒక్కసారిగా అతడి వైపు దూకి గాయపరిచింది.

Also Read: అరటి వ్యర్థాలతో కోట్ల బిజినెస్.. ఎంబిఏ గ్రాడుయేట్ల ఐడియా అదుర్స్

వన్యప్రాణులతో వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్త

పులులు, చిరుతలు వంటి క్రూరమృగాలు ఎంత పరిచయం ఉన్నా ఎప్పుడైనా దాడి చేసే ప్రమాదం ఉంటుంది. వాటిని పెంచేందుకు సరైన అనుమతులు, శిక్షణ పొందిన నిపుణులు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చు. ఈ ఘటన వన్యప్రాణుల భద్రతతో పాటు సోషల్ మీడియా కంటెంట్ కోసం చేసే ప్రమాదకరమైన స్టంట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Related News

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయిపోయిందా? కొత్తది కొనాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే సరి

కరివేపాకు పన్నీర్ ఫ్రై..ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

బాలల దినోత్సవం స్పెషల్.. పిల్లల ముఖంలో నవ్వులు చూసేందుకు 7 టిప్స్

10 నిమిషాల్లో..టెస్టీ టేస్టీ చీజ్ పాస్తా!రుచి అదిరిపోతుంది

ఇడ్లీ,దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. పచ్చికొబ్బరి కారం పొడి రెసిపీ ఇదిగో!

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి..దొండకాయ ఉల్లికారం ఇలా ట్రై చేయండి!

అమ్మమ్మ నాటి రుచితో పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు..ఒక్కసారి ఇలా ట్రై చేయండి

Big Stories

Advertisement
×