Cruise Ship Accident: న్యూ ఓర్లీన్స్ నౌకాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మిస్సిస్సిప్పి నది తీరంలోని పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న భారీ క్రూయిజ్ నౌకను.. ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో అందరూ చూస్తుండగానే క్రూయిజ్ నౌక నీటమునిగింది. అయితే అందులోని ప్రయాణికులు, సిబ్బంది అంతా ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో వెల్లడించారు.
‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే ట్యాంకర్ స్టీరింగ్ వ్యవస్థలో లోపం తలెత్తి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒడ్డున నిలిపి ఉంచిన ఐదు అంతస్తుల ‘అమెరికన్ హెరిటేజ్’ అనే క్రూయిజ్ నౌకను అది బలంగా ఢీకొట్టినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో క్రూయిజ్ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి దాదాపు 180 మంది ఉన్నారని.. ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో నౌకలోకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు వచ్చిందని పేర్కొన్నారు. ఫలితంగా క్రూయిజ్ షిప్ ఒకవైపునకు ఒరిగి బోల్తా పడిందన్నారు.
అంతకుముందు ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మునిగిపోతున్న నౌక నుంచి ప్రయాణికులను రక్షించాయి. దాదాపు 19 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా నీటిలో గల్లంతు కాలేదని.. అందరూ సురక్షితంగా బయటపడటం నిజంగా అద్భుతమని మేయర్ హెలెనా మోరెనో ఆనందం వ్యక్తం చేశారు.
WATCH: Dramatic video shows passengers swimming for help as cruise ship capsizes after being struck by a tanker; 12 people hospitalized, officials say. https://t.co/2UtubUdktf
— Scope Report (@ScopeReport_) November 13, 2026
Also Read: గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం.. వేదికపై రాహుల్, రేవంత్ రెండు కీలక హామీలు!
మరోవైపు ట్యాంకర్ స్టీరింగ్ వ్యవస్థ విఫలమవడమే ప్రమాదానికి కారణమని కోస్ట్ గార్డ్ కెప్టెన్ మెలానీ బర్న్‌హామ్ కూడా పేర్కొన్నారు. అటు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులను సమీపంలోని ఒక ఆడిటోరియంకు తరలించారు. నౌక మునిగిపోవడంతో చాలామంది ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులు, కారు తాళాలు, సెల్‌ఫోన్లను కోల్పోయారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వీరందరికీ ఆహారం, బస, రవాణా సదుపాయాలతో పాటు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ‘అమెరికన్ క్రూయిజ్ లైన్స్’ సంస్థ నిర్వహిస్తున్న ఈ నౌక.. 8 రోజుల పర్యటన ముగించుకుని న్యూ ఓర్లీన్స్‌లో ప్రయాణాన్ని ముగించాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
Rescue operations are underway after a tanker collided with a docked riverboat on the Mississippi River near the Port of New Orleans, officials said.
Read more: https://t.co/qOlUaZhh5k https://t.co/DEwkGSBZoo
— ABC News (@ABC) November 13, 2026
Also Read: రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!