E-Paper
Advertisement

హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?

హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?
Advertisement

Instant dosa powder: ప్రస్తుత ఫాస్ట్ లైఫ్‌లో ఉదయం పూట కిచెన్‌లో గంటల తరబడి గడపడానికి ఎవరికీ సమయం ఉండటం లేదు. ముఖ్యంగా.. బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్, స్టూడెంట్స్ ఎల్లప్పుడూ ఈజీ.. అండ్ క్విక్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ల కోసం వెతుకుతుంటారు. మార్కెట్లో రకరకాల ఇన్‌స్టంట్ మిక్స్‌లు దొరికినప్పటికీ, ఇంట్లోనే శుభ్రంగా, ఆరోగ్య కరమైన పదార్థాలతో తయారు చేసు కునే ప్రిమిక్స్ రుచే వేరు. అందుకే.. ఇప్పుడు ‘ఇన్‌స్టంట్ దోశ ప్రిమిక్స్’ ట్రెండ్ విపరీతంగా పెరిగి పోయింది. ఇంతకీ దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..

దోశ ప్రిమిక్స్ తయారీకి కావలసిన పదార్థాలు:

బియ్యం – 2 కప్పులు

Advertisement

మినపప్పు – అర కప్పు

పచ్చి శనగపప్పు – 2 స్పూన్లు

Advertisement

అటుకులు -అర కప్పు

మెంతులు – 1 స్పూన్

జీలకర్ర – 1 స్పూన్

ఉప్పు – సరిపడా

నూనె లేదా నెయ్యి – దోశలు వేసేటప్పుడు వాడటానికి

తయారీ విధానం:

1.ఈ ఇన్‌స్టంట్ ప్రిమిక్స్ పౌడర్‌ను తయారు చేయడం చాలా ఈజీ. ఇందుకోసం ముందుగా బియ్యం, మినప్పప్పు, పచ్చి శనగ పప్పు, అటుకులు, మెంతులను విడి విడిగా లేదా కలిపి ఒక కాటన్ క్లాత్‌లో శుభ్రంగా ఆరబెట్టాలి. (నీటితో కడగ కూడదు, తడి లేకుండా ఉండాలి).

2.తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం మంటపై బియ్యం, మినప్పప్పు, మెంతులు, శనగ పప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు, రంగు మారే వరకు దోరగా వేయించాలి. చివరిగా అటుకులు వేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేయాలి. అందులోనే జీల కర్ర ,తగి నంత ఉప్పు వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అవసర మైతే జల్లెడ పట్టుకోవచ్చు. ఈ పౌడర్‌ను గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే.. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.

Also Read: కరివేపాకు పన్నీర్ ఫ్రై..ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

దోశ వేసుకునే విధానం:

మీకు దోశలు కావాలనుకున్నప్పుడు, ఒక గిన్నెలో తగినంత ప్రిమిక్స్ పౌడర్ తీసుకుని, అందులో కొద్ది కొద్దిగా నీరు లేదా మజ్జిగ కలుపుతూ ఉండలు లేకుండా దోశ పిండి లాగా కలుపుకోవాలి. దీన్ని 10-15 నిమిషాలు పక్కన ఉంచితే ..పిండి బాగా నానుతుంది. ఆ తర్వాత పెనం వేడి చేసి, దోశ వేసుకుని నూనె లేదా నెయ్యి వేస్తే గుల్లగా, కర కర లాడే దోశలు రెడీ అవుతాయి!

బయట దొరికే ఇన్‌స్టంట్ మిక్సులలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే ఈ ప్రిమిక్స్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ప్రొటీన్లు, కార్బో హైడ్రేట్లు సమంగా అందే ఈ దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇలా ప్రిమిక్స్ తయారు చేసి పెట్టు కుంటే, టైం ఎక్కువగా లేన ప్పుడు బ్రేక్‌ ఫాస్ట్ చిటికెలో అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీకెండ్‌లో ఈ ట్రెండీ దోశ ప్రిమిక్స్ పౌడర్‌ను ట్రై చేయండి!

Related News

క్షణాల్లో అబద్దం అల్లేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు తప్పులు దాచడంలో నిపుణులు

రామాయణంలో జటాయువు గోళ్లు రావణుడు ఎందుకు తీసుకున్నాడు? ఇదే అసలు కారణం

పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడకుండా ఏఐని ప్రయోగించిన తండ్రి.. సూపర్ ఐడియా

చాణక్య నీతి.. నిజమైన స్నేహితులు ఎవరో, నటించే వారు ఎవరో ఇలా తెలుసుకోండి

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. పంజా విసరగానే అమాయకుడు బలి

ప్రెజర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయిపోయిందా? కొత్తది కొనాల్సిన అవసరం లేదు ఇలా చేస్తే సరి

కరివేపాకు పన్నీర్ ఫ్రై..ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!

Big Stories

Advertisement
×