Water Apple: వేసవి తాపం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఎండాకాలంలో శరీరానికి కావాల్సినన్ని మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందకపోతే డీహైడ్రేషన్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు ఇది హీట్ స్ట్రోక్‌కు కూడా దారితీస్తుందట. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడే ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇందుకు కొన్ని రకాల పండ్లు సహాయపడతాయట. ముఖ్యంగా ఈ కాలంలో అధికంగా లభించే వాటర్ యాపిల్ పండ్లను ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వాటర్ యాపిల్ ఎందుకు తినాలంటే..?
వాటర్ యాపిల్‌ని జాంబూ, చాలీ, సీబూ అని కూడా పిలుస్తారట. ఇందులో 90 శాతం నీళ్లు ఉంటాయట. దీంతో శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు వాటర్ యాపిల్ ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని వేడిని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుందని వైద్య నిపుణుు చెబుతున్నారు. శరీరంలో నుండి టాక్సిన్లను బయటకు పంపించడంలో కూడా వాటర్ యాపిల్ సహాయపడుతుందట.
పోషకాల్లో రిచ్:
వాటర్ యాపిల్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు సులభంగా అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయట. వాటర్ యాపిల్‌లో ఉండే విటమిన్లు-C,A; పొటాషియం, ఫోలేట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ALSO READ: వీళ్లు చెరకు రసం అస్సలు తాగకూడదు
ఫైబర్:
వాటర్ యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుందట. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే వీటిని తరచుగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుందట.
గుండెకు వెరీ గుడ్:
ఈ పండ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించేందుకు ఇది సహకరిస్తుందట. అంతేకాకుండా హైపర్ టెన్షన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చర్మానికి మేలు:
వాటర్ యాపిల్ పండ్లు చర్మ సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడం వల్ల వృద్ధాప్య రాకుండా ఉంటాయట.