Shalini Pandey:షాలిని పాండే (Shalini Pandey).. ఈ పేరు గురించి పరిచయాలు అక్కర్లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాలోనే అందం, అభినయం అంతకుమించి అమాయకత్వంతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో తెలుగులో ఈమెకు అస్సలు అవకాశాలే రాలేదు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో అంటేనే భారీ క్రేజ్ అలాంటిది. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో షాలినీకి కూడా మంచి పేరు వచ్చింది. కానీ అవకాశాలు రాకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
నన్ను నన్నుగా గుర్తించండి – షాలిని పాండే
ఇప్పుడు బాలీవుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈమె.. తాజాగా ఒక హీరోయిన్ తో తనను పోల్చడంపై అసహనం వ్యక్తం చేస్తూ మండిపడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. వేరే నటితో తనను పోల్చి చూడడం ఏ మాత్రం నచ్చలేదని, తనను తనలాగే గుర్తిస్తే చాలు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక షాలిని మాట్లాడుతూ.. “ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారందరి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొంతమంది ఫ్యాన్స్ నన్ను హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) తో పోలుస్తూ తమ ప్రేమను కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే మనకు ఇండస్ట్రీలో ఒక ఆలియా ఉన్నారు. కాబట్టి ఆమెలా ఇంకొక ఆలియా అవసరం లేదు. అంతే కాదు ఆమెలా ఉండాలని ఇంకొకరు అనుకోరు కూడా.. ఎందుకంటే ఆమె సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. ఆమెను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అనేక విషయాలలో ఆమెను చూసి నేర్చుకోవాలని కూడా అనుకుంటాను. అంతే తప్ప ఆమెతో నన్ను పోలిస్తే మాత్రం నాకు నచ్చదు. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది షాలిని పాండే. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
షాలిని పాండే కెరియర్..
ఒక షాలిని పాండే విషయానికి వస్తే.. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే హిందీలో వచ్చిన ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈమె . ఇందులో షబానా అజ్మీ, ప్రముఖ హీరోయిన్ జ్యోతిక కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. అంతేకాదు ఇప్పుడు హిందీలో కూడా ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారింది షాలిని. ఇలాంటి సమయంలోనే తనను ఆలియా భట్ తో పోల్చి కామెంట్లు చేయడంతో నచ్చలేదని అసహనం వ్యక్తం చేసింది. మరి ఇప్పటికైనా షాలిని పాండేను తనను తానుగా గుర్తిస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. షాలిని పాండే మాటలకు కూడా కొంతమంది మద్దతు పలుకుతున్నారు.