BigTV English

Best Bedsheets : సమ్మర్.. ఈ బెడ్‌షీట్స్‌తో చల్లగా నిద్రపోండి..!

Best Bedsheets : సమ్మర్.. ఈ బెడ్‌షీట్స్‌తో చల్లగా నిద్రపోండి..!

Bedsheets For Summer : సమ్మర్ సీజన్ మొదలైంది. దీంతో ఎండలు మండుతున్నాయి. రాత్రింబవళ్లు వాతావరణం వెచ్చగా ఉంటుంది. కాబట్టి ఎండ తీవ్రత నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవడానికి లేత రంగుల దుస్తులను ధరించండి. అలానే నిద్రించడానికి కప్పుకునే లేదా పరుచుకునే బెడ్ షీట్లు కూడా ఈ రంగులో ఉండేలా చూడండి. ఎందుకంటే లేత రంగు బెడ్‌షీట్‌లు వాతావరణంలోని వేడిని గ్రహించవు. మీకు చల్లటి అనుభూతిని అందిస్తాయి.


ముదురు రంగు బెట్‌షీట్లు అయితే వాతావరణంలోని వేడిని గ్రహిస్తాయి. వీటివల్ల మీ శరీరం వెచ్చగా మారుతుంది.కాబట్టి సమ్మర్‌లో లేతరంగు బెడ్‌షీట్లను మాత్రమే ఉపయోగించాలి. మీరు వీటిలోని సరైన రంగును ఎంచుకోవడం ద్వారా మీ గదిలో చల్లని వాతావరణాన్ని స‌‌‌ృష్టించొచ్చు. సమ్మర్‌లో చల్లగా నిద్రపోయేందుకు ఎటువంటి రంగు బెడ్‌షీట్లు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More :  సమ్మర్.. మీ చర్మాన్ని ఇలా అందంగా మార్చండి..!


వైట్ కలర్

సమ్మర్‌లో వైట్ కలర్ బెడ్‌‌షీట్‌లు ఒక మంచి ఎంపికని చెప్పాలి. ఎందుకంటే వైట్ కలర్ అనేది వేడిని గ్రహించదు. ఈ కలర్ బెడ్‌షీట్లను మీ బెడ్‌రూమ్‌లో ఉపయోగించడం వల్ల రూమ్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వైట్ కలర్‌ చల్లగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

లేత నీలం

సమ్మర్‌లో లేత నీలం రంగు మీ బెడ్‌‌షీట్‌కు అద్భుతమైన కలర్. ఈ రంగు ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. విశ్రాంత భవనాలకు ఈ రంగుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కలర్ స్పష్టమైన ఆకాశం లేదా సముద్రపు ప్రశాంతమైన అలలను గుర్తు చేస్తుంది.

మింట్ గ్రీన్

సమ్మర్‌లో మింట్ గ్రీన్ కలర్ బెడ్‌షీట్లు చల్లని అడవిలో ఉన్న భావాన్ని కలిగిస్తాయి. మీరు విశ్రాంతిగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఈ కలర్ బెడ్‌షీట్లు వేడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అంతేకాకుండా రాత్రి ప్రశాంతమైన నిద్రను ఆస్వాంచిచడానికి మింట్ గ్రీన్ సహాయపడుతుంది.

Read More : ఇవి తిన్నారంటే.. మీ ఇమ్యూనిటీ పైపైకే..!

లావెండర్

సమ్మర్‌లో లావెండర్ కలర్ బెడ్‌షీట్ వాడటం మంచిది. ఈ కలర్ విశ్రాంతి, ప్రశాంత భావాలను కలిగిస్తుంది. లావెండర్ కలర్ బెడ్‌షీట్ శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతిని అందిస్తాయి. మీ గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా సృష్టించగలవు. వేసవికాలంలో ప్రశాంతమైన నిద్రకు లావెండర్ కలర్ బెడ్‌‌షీట్ మంచి ఎంపిక.

పాస్టెల్ ఎల్లో

ఈ వేసవికి పాస్టెల్ ఎల్లో కలర్ బెడ్‌‌షీట్ సరైనది. మీ బెడ్‌రూమ్‌ను ప్రకాశవంతంగా ఉండేలా ఈ కలర్ బెడ్‌షీట్‌లు చేస్తాయి. అలానే ఆనందం, వెచ్చదనం భావాలను రేకెత్తిస్తాయి. బెడ్‌రూమ్‌కు చల్లని రూపం ఇవ్వడానికి పాస్టెల్ ఎల్లో కలర్ బెడ్‌షీట్ ఉపయోగపడుతుంది.

Disclaimer : ఈ కథనం వైద్య అధ్యయనాల ఆధారంగా రూపొందించబడిన సమాచారం మాత్రమే.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×