BigTV English

Sharmila Fires on YCP Government: ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే ఏం చేశారు.. హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై షర్మిల మండిపాటు

Sharmila Fires on YCP Government: ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే ఏం చేశారు.. హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై షర్మిల మండిపాటు

Sharmila comments on AP Capital: ఏపీలో రాజధాని అంశంపై విపక్షాలు భగ్గమంటున్నాయి. మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశేలో ఎన్నికల జరగనున్నాయి. ఈ తరుణంలో రాజధాని వ్యవహారం తీవ్ర చర్చగా మారింది. విపక్షాలకు ఈ రాజధాని వ్యవహారం టార్గెట్‌గ మారింది. అందుకు ప్రత్యామ్నాయంగ వైసీసీ ప్రభుత్వం విశాఖ రాజధాని కట్టుకునే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు.


ఈ ప్రత్యామ్నాయం విపక్షాలకు మరో అస్ర్తంగా మారింతోంది. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల కూడా విమర్శంచారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారు అంటు ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని విమర్శంచారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదని.. ఉన్నవి కూడా ఉంటాయో, లేదో తెలియని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆవేధన వ్యక్తం చేశారు.

Read more: లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఏపీలో రిటైర్డ్ ఐఏఎస్ రాజకీయ అడుగులు..


ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని షర్మిల విమర్శించారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే.. మీ చేతకాని తనానికి విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక ప్యాకేజీలు లేదు, పోలవరం పూర్తి కాలేదు మరి ఐదేళ్లు ఏం చేశారని అన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల అన్నారు.

అమరావతి పేరుతో చంద్రబాబు చూపించింది త్రీడీ గ్రాఫిక్స్ అయితే.. ఇప్రుడు జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతునారు అన్నారు. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి తెచ్చరన్నారు. రాజధాని వైఫల్యంతో ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను మభ్యపెడుతునారు అన్నారు. జగన్ ప్రభుత్వానికి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని షర్మిల పేర్కొన్నారు.

Tags

Related News

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Big Stories

×