BigTV English

Summer Skin Care : సమ్మర్.. మీ చర్మాన్ని ఇలా అందంగా మార్చండి..!

Summer Skin Care : సమ్మర్.. మీ చర్మాన్ని ఇలా అందంగా మార్చండి..!
Summer Skin Care Tips

Summer Skin Care Tips (health news today) :


సమ్మర్ సీజన్ మొదలైంది. బయటకు వెళ్లాలంటే ఎండలు మండుతున్నాయి. ఎంత ఎండలున్నా బయటకు వెళ్లక తప్పదు. అయితే మనలో చాలా మంచి ఎండలో తిరగాలంటే బయపడుతుంటారు. ఎందుకంటే సూర్యుని ప్రభావం చర్మంపై పడితే ట్యానింగ్ సమస్య వస్తుంది. ట్యానింగ్ వల్ల చర్మం నల్లగా మారుతుంది. అందుకే సమ్మర్‌లో చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని సూర్యుని నుంచి రక్షించుకునేందుకు ఎటువంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Read More : సమ్మర్.. ఈ సీడ్స్‌తో వేడి తగ్గించేయండి..!


సమ్మర్‌లో చర్మాన్ని రక్షించుకునేందుకు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఇవి సీజన్‌కు తగ్గట్టుగా ఉంటాయి. ఈ సన్‌స్క్రీమ్‌లు చర్మాన్ని యూవీఏ, యూవీబి కిరణాల నుంచి కాపాడతాయి. సమ్మర్‌లో కాళ్లు, చేతులు, ముఖానికి, మెడకి సన్‌స్క్రీమ్ రాసుకోవాలి. ఎండలోకి వెళ్లే 20 నిమిషాల ముందుగా చర్మంపై రాసుకోవాలని మర్చిపోవద్దు.

Summer Skin Care Tips

సమ్మర్‌లో అలోవేరా జెల్ చర్మానికి మేలు చేస్తుంది. అలోవేరా జెల్‌కి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ఈ జెల్‌ను ముఖం, మెడ, చేతులకు రాయండి. 30 నిమిషాల తర్వాత జెల్‌ను తుడిచేయండి. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా, చల్లగా మారుతుంది.

Summer Skin Care Tips

చర్మానికి ట్యానింగ్ పట్టకుండా మృతకణాలను తొలగించండి. మృత కణాలను తొలగించడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోవు. టమాటా గుజ్జు లేదా పెరుగుతో చర్మానికి మసాజ్ చేయండి. దీని వల్ల చర్మం శుభ్రం అవుతుంది. టమాటాలో విటమిన్-సి, పెరుగులో లాక్టిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి ట్యాన్ సమస్యలను తొలగిస్తాయి.

Read More : వేసవిలో మీ చర్మాన్ని మెరిపించండి..!

Summer Skin Care Tips

సమ్మర్ నుంచి మీ చర్మాన్ని రక్షించేందుకు ఫేస్‌ప్యాక్‌లు కూడా ట్రై చేయొచ్చు. పెరుగులో కాస్త చెనగపిండి, చెంచా గంధం పొడి, చెంచా పసుపును కలపండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి పట్టించండి. కొంత సమయం తర్వాత ఆరాక ఆ మిశ్రమాన్ని చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది.

Summer Skin Care Tips

శరీరంపై సూర్యుని కాంతి పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి. కాటన్ దుస్తులను ధరించే ప్రయత్నం చేయండి. ఈ జాగ్రత్తల వల్ల చర్మం ట్యానింగ్ భారిన పడకుండా ఉంటుంది.

Disclaimer : ఈ కథనం వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే రూపొందించబడింది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×