బీరు తాగడం వల్ల నష్టమా? లాభమా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు. బీర్ తాగడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అతిగా తాగితే ఆరోగ్య ప్రమాదాలు కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి బీర్ వినియోగం ఎంతవరకు సురక్షితమో తెలుసుకోండి.
బీరు పరిమితంగా తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, ఎముకల సాంద్రత పెరుగుతుందని చెబుతారు. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అంటారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం చాలా మితంగా అంటే తక్కువగా బీర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అదే బీర్‌ను ఎక్కువగా తాగితే మాత్రం విపరీతమైన ప్రతికూల ప్రభావాలు పడతాయి. అధికంగా బీరు తాగేవారు కాలేయం దెబ్బతింటుంది. అలాగే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అది వ్యసనంగా మారి తాగకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. దాన్ని ఒక ఔషధంగా భావించి ప్రతిరోజు కేవలం చిన్న గ్లాసుతో తాగితే ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఐదు శాతం కన్నా తక్కువ ఆల్కహాల్ ఉన్న బీర్లు మాత్రమే తాగాలి. మహిళలు రోజుకు ఒక గ్లాసు బీరు తాగొచ్చు. అదే పురుషులు అయితే ఒక రెండు గ్లాసుల వరకు బీరు తాగవచ్చు. అయితే అందులో ఆల్కహాల్ చాలా తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువగా ఉంటే మాత్రం అది ప్రమాదకరంగా మారుతుంది.
బీరులో పాలీ ఫెనల్స్, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయని ఒక కొత్త అధ్యయనం చెబుతుంది. ఇది మన శరీరంలో లిపిడ్ ప్రొఫైల్ తో సహా గుండె ప్రయోజనాలకు దోహదం చేస్తుందని వివరిస్తుంది.
మితమైన బీరు వినియోగం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
మీరు అధికంగా తాగితే మాత్రం శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. మూత్ర విసర్జనకు తరచూ వెళతారు. శరీరంలో ఉన్న నీటి కంటెంట్ అంతా బయటికి పోతుంది. కాబట్టి జాగ్రత్తగా మితంగా తాగాలి. మితంగా బీర్ తాగడం అలవాటు చేసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మూత్ర విసర్జన ద్వారానే ఆ రాళ్ళను బయటికి పంపిస్తుంది. బీర్లో బి విటమిన్లు లభిస్తాయి. విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ b6, విటమిన్ బి9, విటమిన్ బి12 అత్యవసర పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది మన శరీరంలో శక్తి ఉత్పత్తికి, మెదడు పని తీరుకు, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి అవసరం. అలాగే బీరులో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇది శరీరాన్ని పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Also Read: ప్రతిరోజూ ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపవుతుంది
అధిక బీర్ వినియోగం వల్ల క్యాలరీ కంటెంట్ పెరిగిపోతుంది. దీనివల్ల కొవ్వు పేరుకుపోయి పొట్ట పెద్దగా మారుతుంది. శరీరంలో కొవ్వు పెరిగితే గుండెకు చాలా ప్రమాదం. కాబట్టి వీలైనంతవరకు బీర్ ను తక్కువ స్థాయిలోనే తాగడం మంచిది. రోజుకి ఒక గ్లాసుకు మించి తాగకుండా ఉంటే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది.