BigTV English

Blue Jeans: జీన్స్ ఎక్కువగా బ్లూ కలర్‌లో ఎందుకు ఉంటాయి..?

Blue Jeans: జీన్స్ ఎక్కువగా బ్లూ కలర్‌లో ఎందుకు ఉంటాయి..?
Blue Jeans
Blue Jeans

History Of Blue Color Jeans: జీన్స్ ప్యాంట్లు దాదాపు అన్నీ బ్లూకలర్‌లో ఉంటాయి. దాదాపు మనందరి జీన్స్ బ్లూ కలర్‌లోనే ఉంటాయి. ఈ కలర్ జీన్స్ లేకుండా మన బట్టలు ఉండవు. ఏ బట్టల షాప్‌కు వెళ్లినా బ్లూ కలర్ జీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా బయట ఎవర్నీ చూసినా బ్లూ జీన్స్‌లోనే కనిపిస్తారు.


జీన్స్ బ్లూ కలర్‌లో ఉండటానికి ఉత్పత్తి, వినియోగదారుల ప్రాధాన్యతపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా జీన్స్ బ్లూ కలర్‌లో ఉండటానికి చారిత్రక, సాంస్కృతిక, మానసిక కారణాలు కూడా ఉన్నాయట. అయితే జీన్స్‌లో బ్లూ కలర్‌ ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వెనుకున్న కారణాలు ఏంటో తెలుసుకుందాం.

బ్లూ కలర్ జీన్స్ చరిత్ర 19వ శతాబ్దానికి చెందినది. బ్లూ కలర్ మన్నిక, దృఢత్వానికి ప్రసిద్ధి. ఈ కలర్‌ను
మొదట మైనర్లకు పని దుస్తులు తయారీకి ఉపయోగించారు. ఇండిగోఫెరా అనే మొక్క నుంచి ఈ కలర్ తీస్తారు. దీన్ని నీలిమందు మొక్క అని కూడా అంటారు. ఆ కాలంలో సులభంగా లభించే మన్నికైన రంగు ఇది. దీంతో బ్లూ కలర్ జీన్స్ వాడకం ఎక్కువైంది.


Read More: పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

అంతేకాకుండా బ్లూ కలర్ ఇతర రంగుల కంటే మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బ్లూ కలర్ కఠినమైన డెనిమ్ ఫాబ్రిక్‌‌ను ధృడంగా అతుక్కుంటుంది. దీనివల్ల నీలిమందు మొక్క నుంచి రంగు తీసి బట్టకు వేసినా పోకుండా ఉండేది. ఎక్కువగా ఉతికినా రంగు తగ్గిపోయేది కాదు. అందువల్ల కార్మికులు, మైనర్లలో బ్లూ జీన్స్‌ ప్రముఖ ఎంపికైంది. తద్వారా జీన్స్ ఫ్యాషన్ దుస్తులుగా మారాయి.

దీంతో 20 శతాబ్ధంలో బ్లూ జీన్స్ వాడకం మొదలైంది. ఇందుకు సాంస్కృతిక అంశాలు దోహదపడ్డాయి. యువతలో బ్లూ జీన్స్‌కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో బ్లూ కలర్ జీన్స్ వాడకం ఎక్కువగా ఉండేది.

కొన్ని సందర్భాల్లో మనం వేసుకునే బట్టల రంగు కూడా మన మనసును మారుస్తుంది. బ్లూ కలర్  ప్రత్యేకమైన మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ కలర్ శాంతి, విశ్వాసం, విశ్వసనీయతతో ముడిపడి ఉంటుంది. ఈ రంగు ప్రశాంతత భావాన్ని కలిగిస్తుంది.

బ్లూ కలర్ జీన్స్ కంఫర్ట్ ఫీల్‌ను ఇస్తాయి. దీనిపై ఎటువంటి కలర్ షర్ట్ వేసుకున్నా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఇతరుల చూపు కూడా మనపై పడేలా చేస్తుంది. తద్వారా బ్లూ కలర్ జీన్స్‌కు ప్రాధాన్యత పెరిగింది.

Read More: లోబీపీ ఎందుకు వస్తుంది..? తగ్గాలంటే ఏం చేయాలి..?

బ్లూ కలర్ జీన్స్ ఉత్పత్తి దారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కలర్ వేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఇతర రంగులను జీన్స్‌కు వేయడానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అలానే బ్లూ కలర్ జీన్స్ చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తాయి. ఫ్యాషన్ పరిశ్రమ విస్తరించడానికి బ్లూ జీన్స్ కీలక పాత్ర పోషించాయి. ఎంతలా అంటే కొన్ని కంపెనీలు బ్లూ కలర్ జీన్స్ మాత్రమే తయారు చేస్తున్నాయి.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×