BigTV English

Kodiguddu Vellulli Karam: నోరు చప్పగా అనిపిస్తే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం ఇలా వండి చేసుకోండి, వేడి అన్నంలో అదిరిపోతుంది

Kodiguddu Vellulli Karam: నోరు చప్పగా అనిపిస్తే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం ఇలా వండి చేసుకోండి, వేడి అన్నంలో అదిరిపోతుంది

Kodiguddu Vellulli Karam: ఒక్కొక్కసారి నోరు చప్పగా అనిపిస్తుంది. ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చేసుకొని తినండి. దీన్ని ఒకసారి చేసుకుంటే రెండు రోజులు తినవచ్చు. అయితే కచ్చితంగా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. లేకుంటే ఒక్క రోజుకే ఇది పాడైపోతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడిన కోడిగుడ్లు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, కొత్తిమీర, పసుపు… అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెసిపీ అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ ఇగురుని వేసుకొని తింటే ఆ రుచి ఎలా చేయాలో తెలుసుకోండి.


కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెసిపీ కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – అయిదు
ఎండుమిర్చి – రెండు
కారం – రెండు స్పూన్లు
మిరియాలు – అర స్పూన్
లవంగాలు – మూడు
వెల్లుల్లి రెబ్బలు – పది
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – అరకప్పు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెసిపీ
1. ఒక మిక్సీ జార్లో మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి, ఒక స్పూను జీలకర్ర, కారం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి.
4. తర్వాత ఎండు మిర్చి, కరివేపాకులు, పసుపు వేసి వేయించుకోవాలి.
5. ఇప్పుడు కోడిగుడ్లను పగలగొట్టి అందులో వేయాలి.
6. ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసి తర్వాత ముక్కలుగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు ముందు రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
8. అవసరమైతే కాస్త నీటిని వేసుకోవచ్చు.
9. ఇది ఇగురులా వచ్చే కూర కాదు పొడిపొడిగా వస్తుంది.
10. కానీ అన్నంలో మాత్రం బాగా కలుస్తుంది.
11. స్టవ్ ఆపేసే ముందు కొత్తిమీర తరుగును పైన చల్లుకోండి. రుచి అదిరిపోతుంది.


Also Read:  బియ్యంలో పురుగులు పడుతున్నాయా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

కోడిగుడ్డు, వెల్లుల్లిపాయ రెండిట్లోనూ మనకు కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. కోడిగుడ్డును ఒక సంపూర్ణ భోజనంగా భావిస్తారు. ఎందుకంటే మన శరీరానికి అత్యవసరమైన తొమ్మిది అమినో ఆమ్లాలు కోడిగుడ్డులోనే లభిస్తాయి. అలాగే ప్రోటీన్ నుంచి విటమిన్ డి వరకు ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇక వెల్లుల్లిలో మన రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి. కాబట్టి వెల్లుల్లిపాయ కోడిగుడ్డు కలిపి చేసే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైన నిమ్మరసం పిండుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఈ కూరను పిల్లలకు పెట్టాలనకుంటే కారాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది స్పైసీగా ఉండే వంటకం కాబట్టి పిల్లలు ఆ కారాన్ని తట్టుకోలేరు. దీన్ని వారికి తక్కువ స్పైసీగా పెడితే మంచిది.

Related News

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Liver Health: మీరు చేసే ఈ పొరపాట్లే.. లివర్ డ్యామేజ్‌కి కారణం !

Eye Care: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Big Stories

×