Indian Railways New Rules: ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తుంటారు. సురక్షితంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో భారతీయ రైల్వే సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, చాలా మంది రైలు ప్రయాణానికి ఇష్టపడుతారు. అయితే, కొన్నిసార్లు ట్రాఫిక్ ఇబ్బందులు సహా పలు కారణాలతో కొంత మంది ప్రయాణీకులు తాము వెళ్లాల్సిన రైలు మిస్ అవుతారు. అలాంటి సందర్భంలో చాలా టెన్షన్ పడుతారు. ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతారు. ప్రత్యేకించి కన్ఫామ్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఉన్నవాళ్లు మరింత ఆందోళన చెందుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారతీయ రైల్వే సంస్థ కొన్ని ప్రత్యేక నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఒకరు మరొక రైల్లో ప్రయాణించ వచ్చా?
మీరు జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఉంటే, మరో రైల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాధారణ టికెట్లు ఉన్న ప్రయాణికులు అదే తరగతికి చెందిన మరొక రైలులో, అదే రూట్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. అయితే, ఈ సదుపాయం సాధారణ టికెట్ హోల్డర్లకు మాత్రమే. రిజర్వేషన్ టికెట్ హోల్డర్లకు కాదు. మీరు ఏ మార్గంలో జనరల్ టికెట్ కలిగి ఉన్నారో అదే మార్గంలో మీరు రైలులో ప్రయాణించవచ్చు. మీరు జనరల్ టికెట్ తీసుకొని మరొక తరగతిలో (స్లీపర్ లేదా AC కోచ్) ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
ప్రయాణించాల్సిన రైలు మిస్ అయితే ఏమి చేయాలి?
⦿ కొత్త టిక్కెట్‌ను కొనుగోలు చేయండి: మీరు మీ రైలును మిస్ అయితే, వెంటనే మరో కొత్త టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేయడం మంచిది.
⦿ రీఫండ్ కోసం TDRని ఫైల్ చేయండి: మీరు వెళ్లాల్సిన రైలు మిస్ అయితే, రైల్వేస్ నుంచి రీఫండ్ పొందడానికి TDRని ఫైల్ చేయాలి.
⦿ సహాయక సిబ్బందిని సంప్రదించండి: మీరు స్టేషన్‌లో ఉండి రైలు తప్పిపోయినట్లయితే, మీరు రైల్వే సహాయక సిబ్బందిని సంప్రదించవచ్చు. వాళ్లు మీకు రీఫండ్ లేదంటే ఇతర టికెట్ సంబంధిత సమాచారాన్ని అందిస్తారు.
Read Also: టికెట్ తీసుకోకున్నా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు! రైల్వే కొత్త రూల్ గురించి మీకు తెలుసా?
రీఫండ్ కోసం ఎప్పటి లోగా అప్లై చేసుకోవాలంటే?
మీరు ప్రయాణించాల్సిన రైలును మిస్ అయిన నేపథ్యంలో.. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రీఫండ్ పొందడానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రయాణించే రైలు మిస్ అయిన 4 గంటల లోపు TDR (టికెట్ డిపాజిట్ రిసీట్) ఫైల్ చేయాలి. రైలు, టికెట్ తరగతిని బట్టి రీఫండ్ మొత్తం నిర్ణయించబడుతుంది. పూర్తి మొత్తాన్ని మాత్రం అందివ్వరు. ఛార్జీలను మినహా ఇంచుకుని మిగతా మొత్తాన్ని అందిస్తుంది. రీఫండ్ అనేది సుమారు రెండు నెలల వ్యవధిలో పొందే అవకాశం ఉంటుంది.
Read Also: లాస్ట్ మినిట్ లో జర్నీ క్యాన్సిల్? మీ ట్రైన్ టికెట్ ను వేరే వాళ్లకు ఇలా ట్రాన్సఫర్ చేయొచ్చని తెలుసా?